థర్డ్ జెండర్ తప్పు చేస్తే ఏ జైళ్లో పెట్టాలంటే..!

సాధారణంగా భారత దేశంలో మూడు రకాల జైళ్లు ఉంటాయి. ఒకటి పురుషుల కోసం , ఇంకొకటి మహిళల కోసం, మరొకటి మైనర్ పిల్లల కోసం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఒకవేళ థర్డ్ జెండర్ తప్పు చేస్తే..! తాజాగా ఇదే ప్రశ్న తమిళనాడు హైకోర్టు వరకు చేరింది. దీంతో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు కొత్త నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలను తమిళనాడు ప్రభుత్వం గెజిట్‌లో […]

థర్డ్ జెండర్ తప్పు చేస్తే ఏ జైళ్లో పెట్టాలంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 03, 2020 | 6:29 PM

సాధారణంగా భారత దేశంలో మూడు రకాల జైళ్లు ఉంటాయి. ఒకటి పురుషుల కోసం , ఇంకొకటి మహిళల కోసం, మరొకటి మైనర్ పిల్లల కోసం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఒకవేళ థర్డ్ జెండర్ తప్పు చేస్తే..! తాజాగా ఇదే ప్రశ్న తమిళనాడు హైకోర్టు వరకు చేరింది. దీంతో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు కొత్త నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలను తమిళనాడు ప్రభుత్వం గెజిట్‌లో విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం అరెస్ట్ అయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైలులో నిర్భంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది.

ఏదైనా నేరం చేసి హిజ్రాలు అరెస్ట్ అయితే ముందుగా వారిని జిల్లా వైద్యాధికారులతో పరీక్షలు చేయించాలి. ఆ రిపోర్టులో వారిలో మగ లక్షణాలు ఎక్కువగా ఉంటే పురుషుల జైళ్లలో, ఆడ లక్షణాలు ఎక్కువగా మహిళల జైళ్లలో పెట్టాలని హైకోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని.. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తాజా ఉత్తర్వులను పాటించాలని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.