AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja : స్టార్ హీరోల్లో ఆయన నాకు చాలా క్లోజ్.. భలే సరదా మనిషి .. చాలా మంచివారు

నటి రోజా తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. చిరంజీవి, బాలకృష్ణ ఇలా సీనియర్ హీరోల అందరిసరసన నటించి, తన నటన, అందంతో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో కూడా తన మార్క్ చూపించారు రోజా.

Roja : స్టార్ హీరోల్లో ఆయన నాకు చాలా క్లోజ్.. భలే సరదా మనిషి .. చాలా మంచివారు
Roja
Rajeev Rayala
|

Updated on: May 26, 2026 | 1:04 PM

Share

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన అందాల భామల్లో రోజా ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రోజా.. అలాగే స్టార్ హీరోలతో టాప్ దర్శకులతో కలిసి పని చేశారు ఆమె.. సినిమాల్లో స్టార్ డమ్ సొంతం చేసుకున్న రోజా రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రోజా.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపించింది. ఇక కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయారు. ఇక ఇటీవలే ఓ తమిళ్ సినిమాలో నటించారు రోజా.. కాగా ఓ ఇంటర్వ్యూలో రోజా ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనతో నటించిన హీరోలందరిలో ఆయనతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటాను అని తెలిపారు రోజా.

ఇది కూడా చదవండి : వారెవ్వా.. ఏముంది మావ సాంగ్.! వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఊపేస్తోంది

ఆయన ఎవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాలయ్య రోజా కాంబినేషన్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు జంటగా నటించిన బొబ్బిలి సింహం, భైరవద్వీపం, సుల్తాన్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.. అప్పట్లో ఈ జోడీకి అభిమానులు ఓ రేంజ్‏లో ఉండేవారు.. ఇప్పటికీ రోజా, బాలకృష్ణ జంటగా అభిమానులున్నారు.. వీరిద్దరిని మరోసారి వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆశ పడుతుంటారు. వీళ్ల కాంబోలో వచ్చిన భైరవద్వీపం సినిమా విడుదలై సుమారు 29 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఫా…! ఏం గుండె రా వాడిది.!! భర్త పక్కన ఉండగానే సమంతకు ఐ లవ్ యు చెప్పిన వ్యక్తి..

కాగా ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. నేను నటించిన హీరోల్లో బాలయ్య నాకు చాలా క్లోజ్.. ఆయన చాలా సరదా మనిషి. సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో కబుర్లు చెప్పుకునే వాళ్లం.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరి పార్టీలు వేరైనా.. మేము ఎప్పుడు నవ్వుతూనే పాలకరించుకునేవాళ్లం.. అసెంబ్లీ సమయంలోనూ కలిసినప్పుడు హాయ్ రోజా ఎలా ఉన్నావ్.. ఏంటి సంగతలు అని అడిగేస్తుంటారు బాలయ్య. అక్కడ ఉన్నవారందరూ షాక్ అవుతుంటారు. బాలయ్య మనసులో ఎలాంటివి ద్వేషం ఉండదు.. ఎప్పుడు కనిపించినా దేవుడు నీకు మంచి ఫీచర్స్ ఇచ్చాడు.. నోస్, ఐస్.. భైరవద్వీపం లో క్వీన్ గెటప్ లో ఎంత బాగుంటావు..అని చెప్తుంటారు అంటూ రోజా గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి :Nagarjuna: ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్వారు.. ఆతర్వాత మళ్లీ దాని జోలికి వెళ్ళలేదు..

వింటేజ్ బాలయ్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు
ఎలక్ట్రిక్ బైక్స్ రంగంలోకి హీరో మోటోకార్ప్​.. లాంచ్ ఎప్పుడంటే
ఎలక్ట్రిక్ బైక్స్ రంగంలోకి హీరో మోటోకార్ప్​.. లాంచ్ ఎప్పుడంటే
ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా?.. ఈ తేడా పోవాలంటే ఇలా చేయండి!
ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా?.. ఈ తేడా పోవాలంటే ఇలా చేయండి!
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
వానాకాలం స్పెషల్ స్నాక్.. కొరికితే చీజ్ బయటకు రావాల్సిందే!
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
సిని ఫక్కీలో చేజింగ్..చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు ప్రజలు
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
మీ ఇంట్లో అందరూ ఫోన్‌లోనే మునిగిపోతున్నారా?.. కారణమిదే..
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?
రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా.. తగ్గుతాయా..?