చిన్న విషయానికే ఆందోళన, స్ట్రెస్‌కు గురవుతున్నారా..? కారణం ఇదే
26 May 2026
TV9 Telugu
TV9 Telugu
ఆందోళన, తరచూ కండరాలు పట్టేయడం, మైగ్రేన్ తలనొప్పులు వంటి సమస్యలను ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలుగా చాలా మంది సాధారణమని భావిస్తూ ఉంటారు
TV9 Telugu
అయితే అన్ని సందర్భాల్లో ఇవి ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలు కాదని కొన్ని సందర్భాల్లో ఇవి శరీరంలో మెగ్నీషియం లోపానికి సంకేతాలు కావచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
నరాల పనితీరు, కండరాల ఆరోగ్యం, శరీరానికి విశ్రాంతి కలిగించే ప్రక్రియల్లో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఖనిజం తక్కువైతే శరీరంలో పలు మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ఇవన్నీ మన ఒంట్లో మెగ్నీషియం లోపం కారణంగా సంభవిస్తాయట. మెగ్నీషియం లోపం వల్ల కనిపించే ముఖ్యమైన లక్షణాల్లో ఆందోళన ఒకటి. శరీరానికి ప్రశాంతత కలిగించే గాబా (GABA) అనే న్యూరోట్రాన్స్‌మిటర్ పనితీరుకు మెగ్నీషియం అవసరం
TV9 Telugu
మెగ్నీషియం స్థాయిలు తగ్గిపోతే ఈ న్యూరోట్రాన్స్‌మిటర్ ప్రభావితం కావడంతో గుండె దడ, ఆందోళన, కొన్ని సందర్భాల్లో పానిక్ అటాక్స్ కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచూ కండరాలు పట్టేయడం లేదా కండరాల్లో చిమ్మటలు రావడం కూడా మెగ్నీషియం లోపానికి సంకేతాలే
TV9 Telugu
కండరాల సంకోచం, విస్తరణ ప్రక్రియలకు కూడా మెగ్నీషియం చాలా అవసరం. శరీరంలో దీని స్థాయి తగ్గితే నరాలు అధికంగా స్పందించి కాళ్లు, పాదాలు, కంటి పలకల వద్ద అకస్మాత్తుగా కండరాలు కుదించుకుపోవడం, కంపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
తరచూ వచ్చే మైగ్రేన్ తలనొప్పులకు కూడా మెగ్నీషియం లోపం కారణమని నిపుణులు చెబుతున్నారు. నరాల వ్యవస్థ, రక్తనాళాల పనితీరును సమతుల్యంలో ఉంచడంలో మెగ్నీషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
ఈ ఖనిజం తక్కువైతే మైగ్రేన్‌ను ప్రేరేపించే న్యూరోట్రాన్స్‌మిటర్లు, రక్తనాళాల మార్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తే వైద్యులను సంప్రదించి రక్తపరీక్షలు లేదా మూత్రపరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, గింజలు, పప్పుధాన్యాలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి