AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge Plan: కేవలం రూ.51తో నెల రోజుల రీఛార్జ్ ప్లాన్.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా..

మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే చౌకైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.51తో 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో దీనిని ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.

Recharge Plan: కేవలం రూ.51తో నెల రోజుల రీఛార్జ్ ప్లాన్.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా..
Bsnl
Venkatrao Lella
|

Updated on: May 26, 2026 | 1:05 PM

Share

కేవలం రూ.51తో రీఛార్జ్ చేయించుకుంటే చాలు.. 28 రోజుల పాటు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 2జేబీ డేటా కూడా ఫ్రీ. ఇదే కాదు.. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా సెండ్ చేసుకోవచ్చు. సిమ్ కూడా ఫ్రీనే. ప్రస్తుతం నెల రీఛార్జ్ ప్లాన్లకు కాల్స్, డేటా కావాలంటే రూ.300 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా నెలవారీ బేసిక్ ప్లాన్లు రూ.250 నుంచి మొదలవుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో మంచి అవకాశం కల్పిస్తోంది.

ఫ్రీడమ్ ఆఫర్ వివరాలు

-బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.51 చెల్లిస్తే సరిపోతుంది. సిమ్ ఉచితంగా అందించడంతో పాటు 28 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు. 22 మే నుంచి 30 జూన్ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని బీఎస్‌ఎన్‌ఎల్ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది. అయితే బీఎస్ఎన్‌ఎల్‌లో చేరే కొత్త కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లు, రిటైలర్ స్టోర్లలో ఈ ఆఫర్ పొందవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఈ ఆఫర్‌తో లభిస్తాయి. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు షాకిస్తూ ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. అంతేకాకుండా కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా దీనిని తీసుకొచ్చింది.

రూ.1కే ఫ్రీడమ్ ఆఫర్

గతంలో రూ.1 ఫ్రీడమ్ ఆఫర్ బీఎస్ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది. రూ.1కే సిమ్‌తో పాటు నెల రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం కల్పించింది. ప్రైవేట్ ఆపరేటర్ల రీఛార్జ్ ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. గతంలో రూ.1 ఫ్రీడమ్ ఆఫర్ వల్ల బీఎస్‌ఎన్‌ఎల్ చాలామంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఇప్పుడు రూ.51 ఆఫర్‌తో మరింతమందికి చేరువ కావాలని చూస్తోంది.

Follow Us