Vastu Tips: ఓరీ దేవుడో.. పొరపాటున ఇంట్లో ఈ మొక్కను పెంచారో..మీ ఆనందం, ఐశ్వర్యం మాటాష్…!
ముళ్లుండే మొక్కలు, పాలు గారే మొక్కలతో పాటూ ఈ మొక్కను కూడా ఇంట్లో నాటకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ మొక్కను ఇంట్లో నాటకూడదని మీకు తెలుసా..? అవును, కాకరకాయ మొక్కను కూడా ఇంటి ఆవరణలో నాటకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ కారణాలేంటో ఇక్కడ చూద్దాం..

ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలి. కానీ కొన్నిసార్లు మొక్కల కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ముళ్లుండే మొక్కలు, పాలు గారే మొక్కలతో పాటూ ఈ మొక్కను కూడా ఇంట్లో నాటకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ మొక్కను ఇంట్లో నాటకూడదని మీకు తెలుసా..? అవును, కాకరకాయ మొక్కను కూడా ఇంటి ఆవరణలో నాటకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆ కారణాలేంటో ఇక్కడ చూద్దాం..
వాస్తుశాస్త్రం ప్రకారం, ఈ చేదు మొక్క కాకరకాయ చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రసరింపజేస్తుంది. కాకరకాయ మొక్క నుండి వెలువడే శక్తి ప్రతికూలమైనది. ఈ తీగను నాటిన ఇంట్లో వాస్తు దోషం సంభవించవచ్చు, దాని వల్ల ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయని చెబుతున్నారు.. అందుకే ఈ మొక్కను ఇంట్లో నాటకూడదు.
కాకరకాయ మొక్కను ఇంట్లో నాటడం వల్ల తరచూ వివాదాలు జరుగుతాయట. ఇంట్లో కాకర చెట్టు నాటడం వల్ల గౌరవానికి భంగం కలుగుతుందని చెబుతారు. మీరు గార్డెనింగ్ చేయాలనుకుంటే..ఇంటి గోడ బయట కాకరకాయ వేసుకోవచ్చు అంటున్నారు. గోడ బయట కూడా దక్షిణ దిశలో కాకర మొక్కను నాటితే చికాకులు పెరుగుతాయి..ఇతర దిశల్లో నాటొచ్చు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .








