AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరీ దేవుడో.. ఇష్టమైన సమోసా తినాలంటే.. ఇంత కష్టపడలా సర్..!

భారతదేశంలో సమోసా చాలా ఫేమస్. దాదాపు అందరికీ ఇష్టమైన స్నాక్‌ ఐటమ్‌ సమోసా. సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది సమోసాను తింటారు. పిల్లల నుంచి పెద్దలు దాకా ఈ వంటకాన్ని ఇష్టపడతారు. సమోసాలను ఎక్కువగా స్వీట్-గ్రీన్ చట్నీతో కానీ.. టీ తాగుతూ కానీ తింటారు. కొందరు ఒక్కచేతితో సమోసా తింటే మరికొందరు రెండు చేతులను వాడుతుంటారు. కానీ, అసలు సమోసా ఎలా తినాలో మీకు తెలుసా..? సమోసా తినటంలో హోటల్ మేనేజ్మెంట్‌ విద్యార్థులకు వారి టీచర్‌ చెబుతున్న పాఠం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: ఓరీ దేవుడో.. ఇష్టమైన సమోసా తినాలంటే.. ఇంత కష్టపడలా సర్..!
Samosa Eating Technique
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2025 | 9:25 AM

Share

అందరికీ ఇష్టమైన సమోసాను సహజంగానే ప్రజలు వేడి వేడిగా ఉండగానే రెండు చేతులతో లాగించేస్తుంటారు. కానీ, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై ప్రజలు తీవ్రంగా స్పందించారు. సమోసా తినే ఈ పద్ధతిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. సమోసాను కట్ చేసి ఫోర్క్, చెంచాతో తినడం అనే పద్ధతి పట్ల కొంచెం బాధపడ్డారు. ఎందుకంటే అందరూ తమ చేతులతో సమోసాను తింటూ చట్నీలో అద్దుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇంతకీ సమోసా తినటంలో కోచ్‌ చెప్పిన ఆ టెక్నిక్‌ ఏంటో ఇక్కడ చూద్దాం..

డైనింగ్‌ టేబుల్‌ వద్ద ఒక యువతి ముందు ప్లేట్‌లో సమోసా పెట్టుకుని ఉంది. కోచ్ ముందుగా ప్లేట్‌లోని సమోసాను కత్తితో కోస్తాడు. తర్వాత, సమోసా ముక్క కట్‌ అవగానే, స్పెషల్ ట్రిక్‌ ప్లే చేశాడు. కట్ చేసిన ముక్కను మధ్యలో నుండి పట్టుకునే బదులు, అతను దానిని ఫోర్క్, చెంచాకు కొద్దిగా వెనక్కి హుక్ చేసి నోటిలోకి ఎలా తీసుకుని తినాలో చూపించాడు. ఆ త రువాత, అతను సాంబార్ కూడా తీసుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కానీ, ఈ సమోసాను ఈ విధంగా తినే వీడియోను చూసే ప్రజల్ని ఆకట్టుకునే బదులు భిన్నంగా స్పందించే అవకాశం ఉంది. ఇది చాలా మందికి చాలా అసాధారణమైన విషయం. ఈ సమోసా తినే పద్ధతిని ప్రదర్శించే వ్యక్తి నాగ్‌పూర్‌కు చెందిన ఫేమస్‌ కోచ్. అతను ప్రజలకు ఎలా తినాలో, తాగాలో నేర్పిస్తున్నాడు.

వీడియో ఇక్కడ చూడండి..

@westernwingsspokenenglish అనే హ్యాండిల్ కింద ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు, దీనికి దాదాపు 850,000 వ్యూస్‌, 51,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. సమోసా ఎలా తినాలో నేర్పించే కోచ్ తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే, ఇంటర్నెట్ ప్రజలు దీన్ని ఇష్టపడలేదు.లేదా తక్కువ లైక్ చేసినట్లు కనిపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..