Watch: సిడ్నీ కాల్పుల ఘటనలో రోమాలు నిక్కబొడిచే సీన్.. దుండుడి నుంచి తుపాకీ లాక్కొని.. తిరిగి..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాపడ్డారు. "హనుక్కా బై ది సీ" అనే కమ్యూనిటీ కార్యక్రమంలో, నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని ప్రసిద్ధ బోండి బీచ్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాపడ్డారు. “హనుక్కా బై ది సీ” అనే కమ్యూనిటీ కార్యక్రమంలో, నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలో తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దాడిలో 11 మంది మరణించారని, వారిలో దాడి చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బోండి బీచ్ వద్ద దాడి చేసిన వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరుపిన వీడియో బయటపడింద . ఆ సమయంలో, ఒక వ్యక్తి తన ప్రాణాలను పణ్ణంగా పెట్టి, దాడి చేసిన దుండగుడిని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆ ధైర్యవంతుడైన వ్యక్తి దుండగుడి నంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తోసేసి, అతనికే గురి పెట్టాడు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పార్క్ చేసిన కార్ల వెనుక దాక్కున్న నిరాయుధుడి దైర్యాన్ని తెలియజేస్తుంది. అతను వెనుక నుండి ముష్కరుడి వైపు పరిగెత్తి, అతని మెడ పట్టుకుని, అతని రైఫిల్ లాక్కున్నాడు. దుండగుడు నేలపై పడిపోయాడు. ఆ వ్యక్తి తన తుపాకీని అతని వైపు గురిపెట్టాడు.
వీడియో ఇక్కడ చూడండి…
BREAKING: Video shows how bystander disarmed one of the Bondi Beach gunmen pic.twitter.com/YN9lM1Tzls
— The Spectator Index (@spectatorindex) December 14, 2025
ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారని సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఇద్దరు ముష్కరులు దాదాపు 50 రౌండ్ల కాల్పులు జరిపారు. న్యూ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు మధ్యాహ్నం 2:17 గంటలకు ఈ సంఘటనపై తక్షణమే ప్రతిస్పందించినట్లు తెలిపారు. ఈ మేరకు NSW పోలీసులు సోషల్ మీడియాలో వెల్లడించారు. బోండి బీచ్‌లో ఘాతుకానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు తమ కస్టడీలో ఉన్నారని పోలీసులు ధృవీకరించారు.
ఇదిలావుంటే, ప్రాణాలను కాపాడటానికి పోలీసులు, అత్యవసర బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు. “బాధితులైన ప్రతి ఒక్కరికీ ప్రగాఢ సానుభూతి, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని నా ప్రార్థన” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
