AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి వేళ ఇలాంటి చాక్లెట్స్‌తో తియ్యనీ వేడుక చేసుకుందాం.. ఆ సమస్యలన్నీ పరార్..

చాక్లెట్స్‌ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు..పిల్లల నుంచి పెద్ద‌ల దాకా అందరికీ ఇష్టమే. అయితే చాక్లెట్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయి. కానీ డార్క్ చాక్లెట్లు మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు. వీటిల్లో కొకొవా అధికంగా ఉంటుంది. చ‌క్కెర స్థాయిలు త‌క్కువ‌గా ఉంటాయి. అలాంటి చాక్లెట్ల‌ను తినటం వల్ల ఆరోగ్యానికి మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ పండగవేళ మీరు స్వీట్స్‌కి బదులుగా ఇలాంటి డార్క్‌ చాక్లెట్స్‌ కూడా తీసుకోవచ్చు.. మరీ ఆ లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

దీపావళి వేళ ఇలాంటి చాక్లెట్స్‌తో తియ్యనీ వేడుక చేసుకుందాం.. ఆ సమస్యలన్నీ పరార్..
Dark Chocolate
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2025 | 1:18 PM

Share

దీపావళి అంటేనే తీయ్యటి వేడుక.. దీపాల అలంకరణతో పాటు ఇంట్లో ఎక్కువగా స్వీట్స్‌ ఉంటాయి. అయితే, మీరు స్వీట్స్‌తో పాటు డార్క్ చాక్లెట్స్‌ కూడా తెచ్చుకోండి.. లేదంటే మీ ప్రియమైన వారికి గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు.. ఈ డార్క్‌ చాక్లెట్‌ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. ప‌లు విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. క‌నుక డార్క్ చాక్లెట్ల‌ను త‌ర‌చూ తింటే ఆరోగ్య ప‌ర‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు.

డార్క్ చాక్లెట్ల‌లో ఫ్లేవ‌నాల్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంత‌గానో మేలు చేస్తాయి. రక్త‌నాళాల‌ను ప్ర‌శాంత ప‌రుస్తాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఫ‌లితంగా బీపీ త‌గ్గుతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. డార్క్ చాక్లెట్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. దీంతో శ‌రీరం ఇన్సులిన్‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. ఫ‌లితంగా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.

డార్క్ చాక్లెట్ల‌లో ఉండే కొకొవా కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని పరిశోధకులు తేల్చారు. దీంతో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయ‌ని వారు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య ఉన్న‌వారికి డార్క్ చాక్లెట్లు ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్లు ప్రీ బ‌యోటిక్ ఆహారం. అందువ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

ఇవి కూడా చదవండి

డార్క్ చాక్లెట్ల‌ను తింటే మూడ్ మారుతుంది. ఒంటరిత‌నం ఫీల్ అయ్యే వారు డార్క్ చాక్లెట్ల‌ను తింటే డిప్రెష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. మూడ్ బాగా లేనివారు, ఒత్తిడి, ఆందోళ‌న ఉన్న‌వారు డార్క్ చాక్లెట్ల‌ను తింటుండాలి. ఇక వీటిని తింటే శ‌ర‌రీంలో న్యూరాన్లు సైతం యాక్టివ్ అవుతాయి. దీంతో మెదడు చురుగ్గా ప‌నిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. బ‌ద్ద‌కం పోతుంది. ఇలా డార్క్ చాక్లెట్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..