AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండక్కి ఇళ్లు క్లీన్‌ చేస్తున్నారా..? మీ ఇంట్లో మార్బుల్స్‌ అదంలా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్‌ ట్రై చేయండి..

పండుగ రోజులు మొదలవగానే ప్రతి ఇంట్లోనూ క్లీనింగ్‌ పనులు మొదలవుతాయి. మహిళలు ఇళ్లంతా శుభ్రం చేసిన బాగా అలిసిపోతుంటారు.ఇంట్లో ప్రతి మూలన బూజులు దులపటం, కర్టన్లు, బెడ్‌షీట్లు వాష్‌ చేయటం చేస్తుంటారు. ఇంటి ఫ్లోరింగ్‌ నుండి బాత్రూమ్స్‌, టైల్స్‌, ఇత్తడి, వెండి వస్తువులు అన్నీ క్లీన్‌ చేస్తుంటారు. కానీ, ఇంట్లోని పాలరాయి ఫ్లోరింగ్‌ క్లీన్‌ చేయటం పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే మీ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం.. ఫ్లోర్ క్లీనర్‌లుగా ఉపయోగించగల కొన్ని ఇంటి నివారణలు మీకు ఎక్కువ శ్రమను తగ్గిస్తాయి. ఈ సులభమైన ఫ్లోర్ క్లీనింగ్ హ్యాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పండక్కి ఇళ్లు క్లీన్‌ చేస్తున్నారా..? మీ ఇంట్లో మార్బుల్స్‌ అదంలా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్‌  ట్రై చేయండి..
Tips To Clean Dirty Marble
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2025 | 9:34 AM

Share

దీపావళి పండుగ ముందు ప్రజలంతా ఇల్లు క్లీనింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రతి ఇంట్లో శుభ్రపరచడం జోరుగా జరుగుతోంది. మహిళలు ఇంటి ప్రతి మూల మెరిసిపోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఇంట్లోని మార్బుల్స్‌.. పాలరాయి ఇంటి అందాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో దానిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కాలానుగుణంగా శుభ్రం చేయకపోతే, పాలరాయిపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. అందుకే ఇంట్లో మార్బుల్స్‌ శుభ్రం చేయడానికి చాలా మంది అనేక రకాల ఫ్లోర్ క్లీనర్లను ఉపయోగిస్తారు. కానీ కొన్ని ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా మీ ఇంట్లోని పాలరాయి బండలు కొత్తగా మెరుస్తాయని మీకు తెలుసా..?

మార్బుల్స్‌ శుభ్రం చేసేందుకు అద్భుతమైన చిట్కాలు:

వంట సోడా:

ఇవి కూడా చదవండి

మీ ఇంటి ఫ్లోర్‌ పాలరాయిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా నీటిలో కలిపి చిక్కటి ద్రవణాన్ని తయారు చేయాలి. దీనిని ఫ్లోర్‌ మరకులు ఎక్కువగా ఉన్నచోట మందపాటి పేస్ట్ లా అప్లై చేయండి. మరకను పీల్చుకోవడానికి 24 గంటలు లేదా కొన్ని గంటలపాటు అలాగే వదిలేయాల్సి ఉంటుంది. అది బాగా ఆరిన తర్వాత దానిని గీరి, ఆపై శుభ్రమైన నీటితో తుడవండి. ఇలా చేయడం వల్ల పాలరాయి కొత్తదానిలా మెరుస్తుంది.

నిమ్మరసం:

మీ ఇంటి ఫ్లోర్‌ శుభ్రం చేయడానికి నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం నాలుగు లేదా ఐదు నిమ్మకాయల రసాన్ని ఒక బకెట్ నీటిలో పిండుకోవాలి. తరువాత, మీ మార్బుల్స్‌ నేలను శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగించండి. ఇది మీ మార్బుల్స్‌పై ఉన్న మురికి, మరకలను అన్నింటిని తొలగిస్తుంది.

బేకింగ్ సోడా-నిమ్మకాయ:

లేదంటే, ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం బేకింగ్‌ సోడా, నిమ్మకాయను కలిపి కూడా వాడొచ్చు. ఇందుకోసం మూడు నుండి నాలుగు టీస్పూన్ల బేకింగ్ సోడా, రెండు నుండి మూడు నిమ్మకాయల రసాన్ని సగం బకెట్ నీటిలో కలపండి. తరువాత, ఈ ద్రావణంతో ఇళ్లంతా తుడుచుకోండి. అలా చేయడం వల్ల మీ పాలరాయి కొత్తగా మెరుస్తుంది.

వెనిగర్:

పాలరాయి ఫ్లోర్‌ను శుభ్రం చేయడానికి మీరు వెనిగర్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి, అర కప్పు వెనిగర్‌ను సగం బకెట్ నీటిలో కలపండి. తరువాత, దానిలో ఒక గుడ్డను ముంచి మీ మార్బుల్స్‌ని తుడుచుకోండి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..