AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో మరో విమాన ప్రమాదం..! చెన్నైలో ఇండిగో విమానం అద్దాలు పగిలిపోవటంతో.. 76 మంది ప్రయాణికులు..?

తక్షణమే విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారం అందించాడు. భద్రతా ప్రోటోకాల్‌లను వెంటనే యాక్టివేట్ చేసి, విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అనుమతించారు. ఈ ఘటన అక్టోబర్ 9గురువారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో జరిగింది. కానీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దేశంలో మరో విమాన ప్రమాదం..! చెన్నైలో ఇండిగో విమానం అద్దాలు పగిలిపోవటంతో.. 76 మంది ప్రయాణికులు..?
Indigo Flights
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2025 | 1:44 PM

Share

చెన్నై విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తప్పింది. 76 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం మధురై నుండి చెన్నైకి ప్రయాణిస్తోంది. చెన్నై విమానాశ్రయంలో దిగే ముందు పైలట్ విండ్ షీల్డ్ లో పగులును గమనించాడు. పైలట్ ఆశ్చర్యపోయాడు, కానీ, అతను తెలివిగా వ్యవహరించి చాకచక్యంగా ప్రమాదాన్ని నివారించాడు. తక్షణమే విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సమాచారం అందించాడు. భద్రతా ప్రోటోకాల్‌లను వెంటనే యాక్టివేట్ చేసి, విమానాన్ని రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేయడానికి అనుమతించారు. ఈ ఘటన అక్టోబర్ 9గురువారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో జరిగింది. కానీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మధురై నుండి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం ముందు విండ్ షీల్డ్ (కాక్ పిట్ గ్లాస్)లో పగుళ్లు కనిపించాయి. ల్యాండింగ్ కు కొద్దిసేపటి ముందు పైలట్ పగుళ్లను గమనించాడు. 76 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఇండిగో విమానం రాత్రి 11:12 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ తర్వాత, విమానం బే 95లో ఆపేశారు. అక్కడ సాంకేతిక బృందాలు దెబ్బతిన్న గాజు ప్యానెల్‌ను మార్చివేశారు. అయితే, పగుళ్లకు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు.

ఈ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రధాన దేశీయ విమానయాన సంస్థలు, విమానయాన అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం జరిగింది. పండుగ సీజన్‌కు ముందు భద్రత, కార్యకలాపాలు, ప్రయాణీకుల సేవలను ఈ సమావేశం సమీక్షించింది. భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశించారు. విమానయాన సంస్థలు సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని కోరారు. ఛార్జీల నియంత్రణలను కఠినంగా పర్యవేక్షించాలని ఆయన DGCA టారిఫ్ మానిటరింగ్ యూనిట్‌ను కూడా ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..