AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఛీ.. నువ్వేం మనిషివిరా.. కార్మికుడి ప్రాణం పోతున్నా పట్టించుకోని యజమాని.. వీడియో చూస్తే

మన ఎదురుగా ఎవరైనా కిందపడిపోయినా.. అయ్యో పాపం అని వెళ్లి లేపుతాము. కానీ ఇక్కడో యజమాని నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం పోయింది. తన షాప్‌లో పనిచేసే కార్మికుడు గుండెపోటుతో గిలగిల కొట్టుకుంటుంటే చూసి కూడా కనీసం ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు ఓ యజమాని. చాలా సేపటి తర్వాత అక్కడున్న కార్మికులు చూసి అతన్ని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో సదరు యజమాని తీరుపై నెటిజన్లు దుమ్మోత్తిపోస్తున్నారు.

Watch: ఛీ.. నువ్వేం మనిషివిరా.. కార్మికుడి ప్రాణం పోతున్నా పట్టించుకోని యజమాని.. వీడియో చూస్తే
Viral Video
Anand T
|

Updated on: Oct 12, 2025 | 3:37 PM

Share

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఒక షాప్‌లో పనిచేస్తున్న కార్మికుడు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో కుర్చిలో కూర్చొని గిలగిలా కొట్టుకున్నాడు. అది చూసిన యజమానికి కనీసం ఏమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా ఫోన్‌ చూస్తూ కూర్చున్నాడు. కనీసం లేచి అతని దగ్గరకు కూడా వెళ్లలేదు. చాలా సేపటి తర్వాత ఒక కార్మికుడు వచ్చి అతనికి నీళ్లు తాపేందుకు ప్రయత్నించాడు. కానీ అతని అప్పటికే సృహ కోల్పోయి ఉండడంతో వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు మొత్తం షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు కాగా అవి కాస్తా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీడియో చూసి నెటిజన్లు సదురు యజమానికి తీరుపై మండిపడుతున్నారు. ఆ యజమాని కార్మికుల నిర్లక్ష్యంతోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు. అతన్ని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే, అతను బతికేవాడని కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు బాధితుడి మరణవార్త విన్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సుస్నేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారితో పాటు, వందలాది మంది స్థానికులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటన కేవలం ప్రమాదం కాదని, నేరపూరిత నిర్లక్ష్యం, మానవత్వం లేకపోవడం వల్ల జరిగిన మరణమని వారు చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.