ప్రపంచంలోని టేస్టీ వంటకాల్లో హైదరాబాదీ బిర్యానీ!అలాగే..
భారతీయ ఆహారం ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఇటీవల టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాను విడుదల చేసింది. అందులో భారత దేశానికి చెందిన నాలుగు ఐకానిక్ వంటకాలు ఉన్నాయి. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం
Updated on: Oct 16, 2025 | 10:49 AM

భారతీయ ఆహారం ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఇటీవల టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాను విడుదల చేసింది. అందులో భారత దేశానికి చెందిన నాలుగు ఐకానిక్ వంటకాలు ఉన్నాయి. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాదీ బిర్యానీ : హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ 100 వంటకాల జాబితాలో 31వ స్థానంలో నిలిచింది. ఇది బాస్మతి బియ్యం, మేక, మటన్ లేదా కోడి మాంసం, నిమ్మకాయ, పెరుగు, ఉల్లిపాయలు, కుంకుమపువ్వు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఇది దక్షిణ భారతీయ వంటకంగా చాలా ప్రసిద్ధి చెందింది.

చికెన్ 65 : చాలా అదే వండిన చికెన్‌ను 3-4 రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. చికెన్‌ను ఒక రోజు ఉడికించి ఫ్రిజ్‌లో ఉంచగలిగితే, నాలుగు రోజుల వరకు మళ్లీ వేడి చేయవల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా దీనిని తిరిగి వినియోగించవచ్చు.మంది ఇష్టపడే వంటకాల్లో చికెన్ 65 ఒకటి. ఇది చాలా మందికి ఫేవరెట్ డిష్. అయితే ఇది టెస్ట్ అట్లాస్ ప్రకటించిన 100 అద్భుతమైన వంకటకాల్లో 97వ స్థానంలో నిలిచింది. ఈ వంటకం చెన్నైకి చెందినది. ఇందులో అల్లం, నిమ్మకాయ, ఎర్ర మిరపకాయలు,వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసిన డీప్-ఫ్రైడ్ చేసిన చికెన్ ఉంటుంది. 1965లో తమిళనాడులో AM బుహారీ సృష్టించారని అందుకే దీనికి చికెన్ 65 అనే పేరు వచ్చిందంటారు కొందరు.

వండిన మాంసాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయకపోవడమే మంచిది. వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే వేడి చేయకూడదు. ఆహారం కొద్దిగా చల్లబడిన తర్వాత వేడి చేయాలి. అంతే కాదు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. మీరు తినేంత సమయంలో మాత్రమే మళ్లీ వేడి చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే చికెన్ చెడిపోవచ్చు. అవసరమైతే, దానిని 2-3 గాలి చొరబడని కంటైనర్‌లలో నిల్వ చేయవచ్చు.

బటర్ చికెన్ : అద్భుతమైన టేస్టీ వంటకాల్లో బటర్ చికెన్ ఒకటి. ఇది ప్రపంచ 100 టేస్టీ వంటకాల్లో 29వ స్థానంలో నిలిచింది. ఈ వంటకం 1950లలో ఢిల్లీలో పుట్టిందని చెబుతుంటారు. అలాగే కుందన్ లాల్ గుజ్రాల్ అనే వ్యక్తి మోతీ మహల్ అనే తన రెస్టారెంట్‌ను ప్రారంభించినప్పుడు ఈ స్పెషల్ డిష్‌ను పరిచయం చేశారని సమాచారం. ఇక దీనిని టమోటాల రసం, వెన్నె, తాండూరు చికెన్‌తో తయారు చేస్తారు.



