Andhra: అరె.. అప్పుడే వచ్చిన మామిడి పండ్లు…
వేసవిలో మాత్రమే కనిపించే మామిడిపండ్లు ఇప్పుడు చలికాలంలోనూ నోరూరిస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరి నుంచి ఆఫ్ సీజన్ మామిడిపండ్లను ఒంగోలుకు తీసుకొచ్చి రహదారుల పక్కన విక్రయిస్తున్నారు. చలిలో మామిడిపండ్లు కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యంతో కొనుగోలు చేస్తున్నారు. .. .. .. ..

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే… పేరుకో రకం మామిడిపండ్లు మార్కెట్లో నోరూరిస్తుంటాయి… వేసవిలో మామిడిపండు తిననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు… ఇక వానాకాలం, చలికాలంలో అయితే మామిడిపండ్లకు సాధారణంగా శెలవు ప్రకటించాల్సిందే అంటారు… అయితే కొన్ని రకాల మామిడి అన్ని సీజన్లలో పండుతుంది…అంతెందుకు ఏడాది పొడవునా పునాస రకం మామిడి పండ్లు లభ్యమవుతూనే ఉంటాయి… అలాంటి రకానికి చెందిన మామిడి పండ్లు డిసెంబర్ నెలలో చలి కాలంలో కూడా లభ్యమవుతున్నాయి…
వాస్తవానికి మార్చి, ఏప్రియల్ నెలల్లో మండుటెండల్లో పండే బంగినపల్లి, ఉలవపాడు మామిడి వంటి రకాలను మించి చలికాలంలో కూడా కనిపించే మామిడి పండ్లు ఇప్పుడు నోరూరిస్తున్నాయి… అనంతపురం జిల్లా కదిరి నుంచి ఆఫ్ సీజన్ మామిడి పండ్లను దిగుమతి చేసుకున్న కొంతమంది వ్యాపారులు వీటిని ఒంగోలులో విక్రయిస్తున్నారు… ఒంగోలు – రహదారిపై పేర్నమిట్ల, సంతనూతలపాడు, చీమకుర్తి ప్రాంతాల్లో రోడ్డు సైడ్ పెట్టుకుని విక్రయిస్తున్నారు… రహదారిపై వాహనాల్లో వెళ్లే ప్రయాణీకులు వీటిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు… మండుటెండల్లో కనిపించే మామిడిపండ్లు ఎముకలు కొరికేచలిలో కూడా లభించడం ఏంటని ఆశక్తిగా కొనుగోలు చేస్తున్నారు.




