AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రోడ్డు మీద దొరికిన గుడ్డు.. ఇంటికితీసుకెళ్లిన జంట.. ఆతర్వాత ఊహించని సంఘటన

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని షాక్‌ అయ్యేలా చేస్తుంటాయి. మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని మన కల్లను మనమే నమ్మలేకుండా చేస్తాయి. ఈ వీడియోలో ఒక జంట నీలిరంగు గుడ్డును మోసుకెళ్తున్నారు. పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్న ఆ జంటకు అక్కడి పొదల్లో దొరికిన ఈ గుడ్డును వారు తమ వెంట తీసుకెళ్లి పొదిగించారు. అలా 50 రోజుల తర్వాత అది పొదిగినప్పుడు, వారు ఆశ్చర్యపోయారు! ఈ వీడియో వైరల్ అవుతోంది.

Watch: రోడ్డు మీద దొరికిన గుడ్డు.. ఇంటికితీసుకెళ్లిన జంట.. ఆతర్వాత ఊహించని సంఘటన
Blue Egg
Jyothi Gadda
|

Updated on: Oct 16, 2025 | 8:25 AM

Share

అనాథ జంతువుల పట్ల కరుణ చూపడం మానవతా చర్య. ఈ రోజుల్లో ఇలాంటి ధోరణి పెరిగింది. చాలా మంది ప్రజలు ఎక్కడైన ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న జంతువులు, లేదంటే కదల్లేని స్థితిలో కనిపించిన జంతువులను దత్తత తీసుకుని వాటిని పెంచుతున్నారు. ఒక కుటుంబం ఈము పక్షినిపెంచుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. వారు దాని పుట్టుక నుండి యుక్తవయస్సు వరకు దాని ప్రయాణాన్ని వీడియో ద్వారా ప్రజలకు షేర్‌ చేశారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ సమీపంలో ఒక పార్కులో నడుస్తున్న ఒక యువ జంటకు ఊహించని వింత వస్తువు ఒకటి కనపడింది. రోడ్డు పక్కన పొదల్లో దాగి ఒక నీలిరంగు గుడ్డు లాంటిది లభించింది. అది చాలా అందంగా ఉండటంతో వారు దానిని ఆసక్తిగా ఇంటికి తీసుకువస్తారు. 50 రోజుల పాటు ఆ గుడ్డును చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. చివరకు ఒక రోజు గుడ్డు పొదిగింది. అందులోంచి బయటకు వచ్చే పక్షిని చూసి వారు ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

పొదల్లో దొరికిన ఈ గుడ్డు సాధారణ కోడి గుడ్డు కంటే దాదాపు 10 రెట్లు పెద్దదిగా ఉంది. అద్భుతమైన నీలిరంగు మెరుపును కలిగి ఉంది. దాంతో ఆ మహిళ దానిని తమ వెంట ఇంటికి తీసుకువచ్చి సాధారణ గుడ్లతో పోల్చింది. దాని పెద్ద పరిమాణాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. దాంతో ఈ గుడ్డు నుండి పొదిగిన పక్షిని పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఆ గుడ్డు ఆస్ట్రిచ్ తర్వాత సైజులో రెండవ స్థానంలో ఉన్న స్థానిక ఆస్ట్రేలియన్ పక్షి ఈముకు చెందినదిగా వారు గుర్తించారు. వారు ఆ గుడ్డును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అక్కడ ఉష్ణోగ్రత 37°C వద్ద, వేడిని దాదాపు 50శాతం వద్ద నిర్వహించారు. వారు దానిని ప్రతిరోజూ తిప్పి, క్యాండిలింగ్ ఉపయోగించి దాని అభివృద్ధిని పర్యవేక్షించారు. 50 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గుడ్డు చివరకు పొదిగి, ఒక పక్షిని బయటపెట్టింది. అలా పుట్టిన ఈముపక్షి రిగేకొద్దీ, దానిని పెంచిన జంట కుటుంబంతో స్నేహంగా మారింది. ఉష్ట్రపక్షిని పోలి ఉండే ఈము గరిష్టంగా 6 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. 50 కిలోగ్రాముల వరకు బరువు ఉంటుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈము పెద్దయ్యాక దాని పెంపుడు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుడిలా మారింది. వైరల్ వీడియోలో అది తన కుటుంబంతో ఆడుకోవటం కూడా చూపించారు. ఈము పెంపుడు తల్లిదండ్రులు ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో మిలియన్ల మంది వీక్షించారు. దీనిని @019_editss అనే హ్యాండిల్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, వేలాది లైకులు, కామెంట్లు కూడా వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..