Vikarabad: కర్రె కవితా ఎంత కథ అల్లినవ్.. పతిని ఈ లోకం నుంచి పంపి…
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో అక్రమ సంబంధం హత్యకు దారితీసింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను ట్రాక్టర్‌తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటనను పోలీసులు కేవలం ఒక్క రోజులోనే ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదంగా నమోదైన కేసులో లోతైన దర్యాప్తుతో హత్యకోణం బయటపడింది.

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో అక్రమ సంబంధం దారుణ హత్యకు దారితీసింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కోపంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా విచారించి కేవలం ఒకే రోజులో చేధించడం గమనార్హం.
చౌడాపూర్ గ్రామానికి చెందిన కర్రె కవితకు, అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణకు మధ్య కొన్నేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న కవిత భర్త రత్నయ్య భార్యను మందలించడంతో పాటు అక్రమ సంబంధాన్ని మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో కవిత, రామకృష్ణ ఇద్దరూ కలిసి రత్నయ్యను తొలగించేందుకు పథకం పన్నారు.
పథకం ప్రకారం ఉదయం పొలం నుంచి ఇంటికి వస్తున్న రత్నయ్యను ట్రాక్టర్‌తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో రత్నయ్యకు తీవ్ర రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు అనుమానం కలగడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. లోతైన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కవిత, ప్రియుడు రామకృష్ణ మధ్య అక్రమ సంబంధం బయటపడటంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భార్య కవితే ప్రియుడు రామకృష్ణతో కలిసి భర్త రత్నయ్యను హత్య చేయించినట్టు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. పోలీసుల ప్రశ్నలకు ఇద్దరూ నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు.
ఈ కేసులో హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితులైన భార్య కవిత, ప్రియుడు రామకృష్ణ ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంగా కనిపించిన ఈ ఘటన వెనుక హత్యకోణం ఉందని తేల్చి, ఒకే రోజులో కేసును చేధించారు పోలీసులు.




