Health Tips: వీళ్లు మఖానాకు దూరంగా ఉంటేనే మంచిది..! లేదంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..!!
ఫూల్ మఖానా.. ఇది పౌష్టికాహారం. మఖానాతో స్నాక్స్, ఫ్రై, సైడ్ డిష్, ఉడికించుకుని, డెజర్ట్స్ ఇలా చాలా రకాల వంటకాలను తయారు చేసుకుని తింటారు. ఈ మఖానాలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పిండి పదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. మఖానాలోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. రక్తపోటు తగ్గిస్తుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం శరీరంలోని జీవక్రియ ప్రతిచర్యలకు అవసరం. ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల సంకోచాలు, నరాల పనితీరు అన్నింటికీ మెగ్నీషియం హెల్ప్ చేస్తుంది.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మఖాను కొందరు మాత్రం పొరపాటున కూడా ముట్టుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




