Psychology: ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో జర జాగ్రత్త.. తెలివితేటల్లో వీరు చాణక్యులు!
bright brained blood groups in Human: ప్రధానంగా మనుషుల్లో నాలుగు రకాల రక్త వర్గాలు ఉంటాయి. అయితే కొన్ని రక్త వర్గాలు ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా తెలివైనవారుగా ఉంటార. పరిశోధనల అభిప్రాయం ప్రకారం వీరి మెదడు ఇతర బ్రడ్ గ్రూప్‌ల వారి కంటే మరింత చురుకైనదని తేలింది. అదే రకం బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒంట్లో అన్ని రకాల అవయవాలకు సరైన రక్త సరఫరా చాలా అవసరం. ప్రధానంగా మనుషుల్లో నాలుగు రకాల రక్త వర్గాలు ఉంటాయి. అయితే కొన్ని రక్త వర్గాలు ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా తెలివైనవారుగా ఉంటార. పరిశోధనల అభిప్రాయం ప్రకారం వీరి మెదడు ఇతర బ్రడ్ గ్రూప్‌ల వారి కంటే మరింత చురుకైనదని తేలింది. అదే రకం బ్లడ్ గ్రూప్ అనేది ఇక్కడ తెలుసుకుందాం..
మానవ శరీరంలో నాలుగు ప్రధానంగా A, B, AB, O అనే రక్త గ్రూపులు ఉన్నాయి. ఈ రక్త గ్రూపులు మళ్లీ ఒక్కొక్కటి పాజిటివ్, నెగెటివ్ అనే రెండు రకాలుగా ఉంటుంది. ఈ రక్త వర్గాలు మన శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని కూడా వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బి పాజిటివ్, ఓ పాజిటివ్ రక్త వర్గాలు ఉన్నవారి మెదడు అత్యంత వేగంగా ఉంటుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి పెరిటోనియల్, టెంపోరల్ లోబ్స్ ఎక్కువ చురుగ్గా ఉంటాయి. మెదడులోని ఈ భాగం సమాచారాన్ని ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా ఈ బ్రడ్ గ్రూప్ వ్యక్తులు ఇతరులకన్నా బాగా ఆలోచించే, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను కలిగి ఉంటారు.
అలాగే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మంచి రక్త ప్రసరణ ఉంటుంది. మంచి రక్త ప్రవాహం కారణంగా మెదడుకు అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది. దీని కారణంగా, వారు ఎక్కువగా గుర్తుంచుకుంటారు. వీరు ఎక్కువ కాలం సమాచారాన్ని బాగా గుర్తుంచుకుంటారని పరిశోధనల్లో తేలింది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








