మగవారిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. లైట్ తీసుకుంటే ప్రాణమే..
ఆరోగ్యంలో మార్పులను పురుషులు విస్మరిస్తున్నారు. ధూమపానం, మద్యం సేవించడం, దీర్ఘకాలిక ఒత్తిడి, ఊబకాయం, వైద్య పరీక్షలను ఆలస్యం చేయడం వంటి ఐదు ప్రధాన జీవనశైలి అలవాట్లు పురుషులలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని డాక్టర్ వినీత్ తల్వార్ హెచ్చరించారు. ఈ అలవాట్లను గుర్తించి నివారించడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చని సూచించారు.

ఇటీవలి కాలంలో క్యాన్సర్‌తో బాధపడే పురుషుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే చాలా మంది తమ ఆరోగ్యంలో వచ్చిన మార్పులను లేదా లక్షణాలను గమనించినా వాటిని విస్మరిస్తున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ధూమపానం, పెరిగిన బొడ్డు కొవ్వు వంటి రోజువారీ జీవనశైలి అలవాట్లే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. RGCIRCలోని మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ వినీత్ తల్వార్.. పురుషులలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఐదు ప్రధాన అలవాట్ల గురించి వివరించారు.
ధూమపానం – పొగాకు వాడకం
క్యాన్సర్‌కు అతిపెద్ద కారణాలలో ధూమపానం, పొగాకు వాడకం ప్రధానమైనవి. దేశంలో దాదాపు 42 శాతం క్యాన్సర్లు పొగాకు వాడకం వల్లనే సంభవిస్తున్నాయి. సిగరెట్లు లేదా అప్పుడప్పుడు ధూమపానం కూడా ఊపిరితిత్తులు, గొంతు, నోరు, మూత్రాశయం, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు ప్రధాన కారణాలలో ఒకటిగా మారుతుంది. నిరంతర దగ్గు, నోటి పూతల, ఆకస్మిక బరువు తగ్గడం, తినడానికి ఇబ్బంది పడటం.
మద్యం సేవించడం
క్రమం తప్పకుండా ఆల్కహాల్ సేవించడం కాలేయం, నోరు, అన్నవాహిక, పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ధూమపానంతో కలిపి ఆల్కహాల్ సేవించినప్పుడు, క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది. తరచుగా అలసట, కడుపు నొప్పి, జీర్ణక్రియలో మార్పులు లేదా అప్పుడప్పుడు ఆమ్లత్వం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి తోసిపుచ్చవద్దు.
దీర్ఘకాలిక ఒత్తిడిని
పురుషులు తరచుగా పని, కుటుంబ బాధ్యతల కారణంగా ఒత్తిడిని అనుభవిస్తారు. అయితే ఈ దీర్ఘకాలిక ఒత్తిడిని సాధారణంగా తీసుకోవడం ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత, వాపు, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటానికి కారణమవుతుంది. ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదానికి దోహదపడతాయి.
పెరిగిన బొడ్డు కొవ్వు – ఊబకాయం
ఆధునిక జీవనశైలి మార్పుల వల్ల వచ్చే ఊబకాయం, చాలా మంది పురుషులు అనుకున్నదానికంటే ఎక్కువ హానికరం. ఊబకాయం ఉన్నప్పుడు శరీరంలో ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్, కాలేయ క్యాన్సర్‌లకు కారణమయ్యే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థలో మార్పులు, ఉబ్బరం, ప్రేగు అలవాట్లలో మార్పులు.
వైద్య పరీక్షలను ఆలస్యం చేయడం
పురుషులలో అత్యంత ఆందోళనకరమైన అలవాట్లలో మరొకటి సాధారణ ఆరోగ్య చెకప్‌లను చేయించుకోకపోవడం. ఏదైనా లక్షణం కనిపించినా వైద్య పరీక్షలను ఆలస్యం చేయడం తరచుగా క్యాన్సర్ ఆలస్యంగా నిర్ధారణ కావడానికి దారితీస్తుంది. ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, నిద్ర నాణ్యత గురించి అవగాహన పెంచుకోవడం, అలాగే సకాలంలో ఆరోగ్య తనిఖీలు చేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




