- Telugu News Photo Gallery Business photos Gold and silver prices have fallen.. What is the price of 10 grams..
Gold Price Updates: ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
Gold Price Updates: ద్రవ్యోల్బణం,ప్రపంచ నష్టాలను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు బంగారాన్ని బలమైన ఆస్తిగా భావిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన డాలర్ కారణంగా బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. అలాగే..
Updated on: Dec 13, 2025 | 10:29 AM

Gold Price Updates: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు మహిళలు. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతుంది. కానీ తగ్గిన సమయంలో మాత్రం స్వల్పంగానే తగ్గుతూ ఉంటుంది. గత రెండు, మూడు రోజులుగా తులం బంగారంపై ఏకంగా రూ.3 వేలకుపైగా పెరిగింది. ఇక వెండికి మాత్రం అంతే లేదు. పరుగులు పెడుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు బంగారంపై 870 రూపాయలు పెరిగింది.

కానీ ప్రస్తుతం డిసెంబర్ 13న తులం బంగారంపై ఎంత తగ్గిందో తెలుసా? అక్షరాల 270 రూపాయలు. పెరగడం మాత్రం భారీగా పెరుగుతుంది. కానీ తగ్గినప్పుడు స్వల్పంగానే తగ్గుతుంది. ఇందేందిరా సామి పెరిగినప్పుడు భారీగా పెరుగుతూ తగ్గినప్పుడు మాత్రం ఇంత తక్కువ తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు బంగారం ప్రియులు.

ప్రతి రోజు ఉదయం పది గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. అలాగే ఇప్పుడు కూడా ధరలు అప్‌డేట్ అయ్యాయి. ప్రస్తుతం తగ్గింపు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,910 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,750 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానిస్తే కిలో సిల్వర్‌పై ఏకంగా 6000 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,98,000 వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, కేరళలో అయితే కిలోపై మరి ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో సిల్వర్ ధర 2,10,000 వద్ద కొనసాగుతోంది.

ద్రవ్యోల్బణం,ప్రపంచ నష్టాలను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు బంగారాన్ని బలమైన ఆస్తిగా భావిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన డాలర్ కారణంగా బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది.




