- Telugu News Photo Gallery Business photos These are the reasons why trains travel faster at night than during the day
Indian Railways: మధ్యాహ్నం కంటే రాత్రి సమయంలో రైళ్లు వేగంగా ఎందుకెళ్తాయి..? మీకు తెలియని విషయాలు ఇవే..
మనలో అందరూ రైలు ప్రయాణం ఒక్కసారైనా చేసి ఉంటారు. రాత్రి వేళల్లో కూడా ప్రయాణం చేసి ఉంటారు. మీరు గమనిస్తే మధ్యాహ్నం కంటే రాత్రి సమయంలో ట్రైన్ స్పీడ్‌గా వెళ్తూ ఉంటుంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇందులో చూడండి.
Updated on: Dec 12, 2025 | 4:33 PM

రైలు ప్రయాణం నచ్చనివారు ఎవ్వరూ ఉండరు. ఇక దూరపు ప్రాంతాలకు వెళ్లేవారికి ట్రైన్ జర్నీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. భారత్‌లో వందే భారత్ రైళ్ల రాకతో మరింత వేగవంతంగా, సౌకర్యవంతగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం లభించింది. రైళ్లు మధ్యాహ్నం కంటే రాత్రి వేళల్లో ఎక్కువ స్పీడ్‌తో వెళ్తుంటాయి. ట్రైన్ జర్నీ చేసేవాళ్లు అందరూ దీనిని గమనించి ఉంటారు. ఎందుకు రాత్రి వేళల్లో స్పీడ్‌గా వెళ్తాయో తెలుసా..?

రైళ్లు రాత్రి సమయంలో అధిక వేగంతో వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. పగటిపూట చిన్న చిన్న రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీంతో ప్రతీ రైల్వేస్టేషన్లలోనూ ఆగాల్సిన అవసరం ఉంటుంది. పదే పదే ఆపాల్సి ఉంటుంది గనుక మధ్యాహ్నం పూట స్లోగా వెళతాయి.

ఇక రాత్రిపూట జనాల తాకిడి తక్కువగా ఉంటుంది. దీని వల్ల ట్రైన్లు అధిక వేగంతో వెళ్తుంటాయి. మరో కారణం ఏంటంటే.. మధ్యాహ్నం సమయంలో రైళ్ల రాకపోకలు ఎక్కువగా సాగిస్తూ ఉంటాయి. దీని వల్ల మధ్యలో ఆగాల్సి ఉంటుంది. అదే రాత్రిపూట గ్రీన్ సిగ్నల్ ఎక్కువగా లభిస్తుంది.

రాత్రివేళ గ్రీన్ సిగ్నల్ ఎక్కువగా లభిస్తుంది గనుక వేగాన్ని తగ్గించాల్సిన అసవరం ఉండదు. ఇక పగటిపూట ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతాయి. అదే రాత్రిపూట పనులు ఏవీ ట్రాక్‌లపై జరగవు. దీని వల్ల ట్రైన్లు వేగంగా వెళ్తుంటాయి.

ఇక మధ్యాహ్నం వేళల్లో ట్రాక్‌లపై మానవులతో పాటు జంతువులు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట ఆ ఇబ్బంది ఉండదు. అందుకే లోకో పైలట్లు రాత్రిపూట ఎక్కువ స్పీడ్‌తో రైళ్లు నడుపుతారు.




