భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య హత్యకు కారణాలపై డెత్ డిక్లరేషన్ ఇచ్చి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

భార్య వేధిస్తుందని.. చంపి.. ఆ తర్వాత భర్త ఉరివేసుకుని చనిపోయిన ఘటన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.. ఈ జంట మరణాల ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగింది. బాలాజీ రామాచారి అనేవ్యక్తి తన బార్య సంధ్య ను తాడుతో ఉరిబిగించి హత్య చేశాడు.. తన భార్యను హత్య చేయడానికి కారణాలన్నీ వీడియో రికార్డ్ చేసి పోలీసులకు మర్డర్ డిక్లరేషన్ ఇచ్చాడు.. తన భార్య వేధింపులు భరించలేకే హత్య చేసినట్లు వీడియో ద్వారా డిక్లరేషన్ ఇచ్చిన బాలాజీ రామాచారి.. తాను కూడా అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మొదటి భార్య మరణానంతరం బాలాజీరామాచారి సంధ్య అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనను భార్య వేధింపులకు గురి చేస్తుందని, ఆ వేధింపులు భరించలేక భార్యను చంపినట్లు తెలిపాడు.. అనంతరం వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు.
భార్య భర్తల మరణంతో.. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఇద్దరి మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.. ఈఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




