మటన్‌ త్వరగా ఉడకాలంటే.. ఇలా చేయండి

06 January 2026

TV9 Telugu

TV9 Telugu

చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. వంటి రకరకాల నాన్‌వెజ్ వంటకాలంటే భోజన ప్రియులకు మహా ఇష్టం. అయితే వీటిని వండటమే పెద్ద పని

TV9 Telugu

ముఖ్యంగా మటన్ కర్రీ చేయడం మరింత కష్టం. ఎందుకంటే అది ఓ పట్టాన ఉడకదు. అయితే కొన్ని చిట్కాలు ద్వారా మటన్‌ త్వరగా ఉడికించవచ్చని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

మటన్‌ త్వరగా ఉడకాలంటే.. మాంసం బాగా కడిగి నీళ్లన్నీ పోయేలా గట్టిగా పిండాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా గళ్లుప్పు వేసి బాగా కలిపి ఒక గంట తర్వాత వండితే మాంసం మెత్తగా ఉడుకుతుంది

TV9 Telugu

మాంసాన్ని వండే ముందు చక్కెర వేయకుండా తయారుచేసి వడకట్టిన టీ డికాషన్‌ని అందులో పోసి ఒక అరగంట లేదా గంట పాటు అలాగే ఉంచాలి

TV9 Telugu

ఆ తర్వాత వండితే మటన్‌ త్వరగా ఉడుకుతుంది. టీలో ఉండే ట్యానిన్లు మాంసాన్ని త్వరగా, మెత్తగా ఉడికేలా చేస్తాయి. అలాగే వెనిగర్ లేదా నిమ్మరసం ద్వారా కూడా మటన్‌ త్వరగా ఉడుకుతుంది

TV9 Telugu

టమాటాల్లో కూడా ఆమ్ల గుణం ఉంటుంది. అందుకే వీటిని సాస్ రూపంలో వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చాలామంది నాన్‌వెజ్ వంటకాల్లో టొమాటో ముక్కలను వేస్తుంటారు

TV9 Telugu

అయితే వీటిని తాలింపులోనే వేస్తే మటన్‌ త్వరగా ఉడుకుతుంది. కూరకు అదనపు రుచీ వస్తుంది. పైగా మటన్‌ ముక్కలు కూడా మెత్తగా మృదువుగా మారుతుంది

TV9 Telugu

ఉడికించేటప్పుడు పచ్చి బొప్పాయి ఆకులు లేదా అల్లం తురుము లేదా పెరుగుతో నానబెట్టి వండినా మటన్ తొందరగా ఉడికిపోతుంది