AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanut Nutrition: పల్లీలు ఇలా తింటే ప్రమాదమే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

వేరుశనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి అనేక విదాలుగా ఉపయోగపడుతాయి. శీతాకాలంలో ప్రతిరోజూ పల్లీలు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అయితే చాలా మంది వీటిని సరైన విధానంలో తీసుకోకపోవడం, వాటిని తినేప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల వాటి ప్రయోజనాలను పొందలేరు. కాబట్టి పల్లీలు తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Peanut Nutrition: పల్లీలు ఇలా తింటే ప్రమాదమే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
Peanuts Health Benefits
Anand T
|

Updated on: Jan 11, 2026 | 11:42 AM

Share

శీతాకాలంలో వేరుశెనగ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వేరుశెనగ తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేరుశెనగలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. వేరుశెనగలో ఉండే అమైనో ఆమ్లాలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వేరుశనగల వల్ల కలిగే ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి పెంచుతుంది: శీతాకాలం మనం త్వరగా రోగనిరోధక శక్తిని కోల్పోతాం. దీనివల్ల త్వరగా సీజనల్ వ్యాధుల భారీన పడుతాం. కాబట్టి వేరుశెనగలు తింటే వీటిలో ఉంటే ప్రోటీన్ మనకు శక్తికి అందిస్తుంది. ఇది శరీరాన్ని బలంగా, చురుకుగా ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే రెస్వెరాట్రాల్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

బరువు నియంత్రంణ: వేరుశెనగలో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, మితంగా తీసుకుంటే, అవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. వేరుశెనగలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచుతుంది, తద్వారా బరువు పెరగడానికి ప్రధాన కారణమైన అతిగా తినడం నివారిస్తుంది.

పల్లీలు తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పల్లీలు మన ఆరోగ్యానికి మేలు చేసినవే అయినప్పటికీ.. వాటిని తీసుకునే విధానంలో మార్పులు వస్తే అవి హానికరంగా మారొచ్చు. అవును ఎక్కువగా వేరుశెనగలు తినడం వల్ల బరువు పెరగడం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, శీతాకాలంలో మీరు ప్రతిరోజూ ఒక చిన్న గుప్పెడు వేరుశెనగలు మాత్రమే తినండి. వేరుశెనగ అలెర్జీలు ఉన్నవారు వాటి జోలికి అస్సలు వెళ్లకండి.

పల్లీలను డ్రీప్రై చేయకండి

అలాగే చాలా మంది టేస్ట్ కోసం పల్లీలను వేయించుకొని, ఉప్పు, కారం కలుపుకొని తింటారు. ఇలా చేడం వల్ల వాటిని పూర్తి ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్రక్రియ శరీరంలో అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. వేరుశెనగలను డీప్-ఫ్రై చేయడం వల్ల వాటి పోషక విలువలు తగ్గుతాయి. కాబట్టి శనగలను నార్మల్‌గా లేదా ఉడికించి తినడం ఉత్తమం. సరైన పద్ధతిలో, సరైన సమయంలో తీసుకుంటే, వేరుశెనగలు మీ శీతాకాలపు ఆహారంలో ఆరోగ్యకరమైన, పోషకమైన ఎంపికగా మారుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్
కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్