Hyderabad: మరీ ఇలా తయారయ్యారేంట్రా.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే..
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ క్రైమ్ పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ నేరస్థులు, హంతకులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. నేర ప్రవృతిని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామని పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఇలాంటి వారితో మాత్ర మార్పు రావడం లేదు. తాజాగా నగరంలోని రేతిబౌలి సర్కిల్‌లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.

నడిరోడ్డుపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. నగరంలోని గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో రేతిబౌలి పిల్లర్ నెంబర్ 52 వద్ద ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నాంపల్లి్కి చెందిన సయ్యద్ ఉస్మాన్ అనే ఓ రౌడీ షీటర్, ఇమ్రాన్ అనే వ్యక్తి మధ్య ఒక భూమి సెటిల్‌మెంట్ విషయంలో వివాదం చెలరేగింది. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న రౌడీ షీటర్ ఉస్మాన్ శుక్రవారం ఇమ్రాన్‌పై కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడిన ఉన్న ఇమ్రాన్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అతను అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని ఎలాగైనా పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు అంటున్నారు.
నగరంలో ఓవైపు కమిషనర్.. మరోవైపు పోలీసులు నేరాలను, నేరస్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ పదేపదే చెబుతూ హడావుడి చేస్తున్నా.. రౌడీషీటర్లు మాత్రం పబ్లిక్‌గా రెచ్చిపోతూనే ఉన్నారు. తమ మాట వినకపోతే తాడోపేడో తేల్చుకుందామంటూ దాడులకు పాల్పడుతున్నారు. ఒక నేరం చేస్తే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోననే కనీస ఆలోచన కూడా చేయడం లేదని అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




