సీజన్‌తో సంబంధం లేకుండా విరివిరిగా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. గింజల్లోనే కాదు దాని తొక్కలోనూ ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి
TV9 Telugu
నిజానికి దానిమ్మకు సంబంధించిన వేరు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు, అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఈ పండ్లు ముఖ్యంగా గర్భవతులకు ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ తొక్క వగరుగా ఉంటుందని తెలుసు. అయినా దాన్ని ముక్కలుగా చేసి సలాడ్స్ రూపంలో తినడం మంచిది
TV9 Telugu
ఇలా తినడం వల్ల వగరు తగ్గడమే కాదు.. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
ఈ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించి తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది
TV9 Telugu
రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అది పుష్కలంగా లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది
TV9 Telugu
నీళ్ల విరేచనాలు అవుతోంటే.. గ్లాసు దానిమ్మ రసం లేదా ఓ కప్పు గింజలు తీసుకోండి. ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి.. గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కొంచెం కలిపి గొంతును తాకేలా పుక్కిలిస్తే గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది