పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ.. రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా అడిగేవారేరి..?
మళ్లీ పండగొచ్చింది. సొంతూళ్లకు జనం దండు కదిలింది. క్యాలెండర్ మారిందంతే..! మళ్లీ సేమ్ సీన్. అదే దోపిడీ. కాకపోతే ఈసారి ఇంకాస్త మోత మోగిపోతోంది. హైదరాబాద్‌నుంచి ఏపీకి ఏ బస్సుచూసినా కాలు మోపే జాగా లేదు. స్పెషల్ బస్సులు వేశామంటున్నారు. ట్రావెల్స్ దోచుకుంటే ఊరుకునేది లేదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ సంక్రాంతికి కూడా ప్రయాణికుల నిలువుదోపిడీ జరుగుతోంది.

మళ్లీ పండగొచ్చింది. సొంతూళ్లకు జనం దండు కదిలింది. క్యాలెండర్ మారిందంతే..! మళ్లీ సేమ్ సీన్. అదే దోపిడీ. కాకపోతే ఈసారి ఇంకాస్త మోత మోగిపోతోంది. హైదరాబాద్‌నుంచి ఏపీకి ఏ బస్సుచూసినా కాలు మోపే జాగా లేదు. స్పెషల్ బస్సులు వేశామంటున్నారు. ట్రావెల్స్ దోచుకుంటే ఊరుకునేది లేదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఈ సంక్రాంతికి కూడా ప్రయాణికుల నిలువుదోపిడీ జరుగుతోంది.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వ రవాణా సంస్థలు సంక్రాంతి పండగకోసం అదనపు సర్వీసులు వేశాయి. కానీ వెళ్లే వాళ్లు లక్షల్లో ఉండేసరికి ఆ బస్సులు ఏ మూలకూ సరిపోవడంలేదు. అందరికీ ముఖ్యమైన పండుగ కావడంతో కుటుంబాలతో బయలుదేరుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరక్క.. మరో దారిలేక ప్రైవేట్ ట్రావెల్స్‌ని ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ కంటే గరిష్ఠంగా 50శాతం ఛార్జీలు పెంచేందుకే ట్రావెల్స్‌కు అనుమతి ఇచ్చారు. అయినా భలే ఛాన్సులే అంటూ ప్రైవేట్ ట్రావెల్స్ డబుల్ ఛార్జీలతో బాదేస్తున్నాయి. రవాణాశాఖ అధికారుల హెచ్చరికలను లెక్కచేయడంలేదు ప్రైవేట్ బస్సులు. దీంతో ట్రావెల్స్ నిర్వాహకులకు ఏపీ రవాణాశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇక నిబంధనలు ఉల్లంఘించిన 75 ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ రవాణాశాఖ కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమిది RTA బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
అక్కడికి ఇక్కడికీ అనే తేడాలేం లేవు. ఎక్కడికెళ్లాలన్నా డిస్టెన్స్‌ని బట్టి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అదేంటీ ఈ రూట్లో ఇంతేకదా అంటే.. సంక్రాంతి సీజన్‌లో రూల్స్‌గీల్స్ జాన్తానై అంటున్నారు. -హైదరాబాద్ టు విజయవాడ ఆర్టీసీ బస్సు రూ.450 నుంచి రూ.800 దాకా వసూలు చేస్తుంటే…ప్రైవేట్ ట్రావెల్స్ రూ.2700 నుంచి రూ. 4,000 దాకా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ టు వైజాగ్ వయా రాజమండ్రి ఆర్టీసీ రూ. 1050 నుంచి రూ. 2600 దాకా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు తెలంగాణ ఆర్టీసీ లహరి ACలో రూ.1500 చార్జ్ చేస్తుంటే…ప్రైవేట్ ట్రావెల్స్ రూ.4,000- రూ.5,000 దాకా వసూలు చేస్తున్నాయి. లగ్జరీ బస్సునుంచి స్లీపర్ దాకా ఉన్న రేట్లివి. తెలంగాణలోని దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఏపీలో స్వస్థలాలకు వెళ్లి రావాలన్నా జేబులు ఖాళీ అయ్యేలా ఉన్నాయి. కుటుంబాలతో ప్రయాణం పెట్టుకుంటే ఛార్జీలకే రానుపోను ఇరవై పాతికవేలు ఖర్చయ్యేలా ఉంది.
ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని కట్టడి చేసేందుకు ఏపీ రవాణాశాఖ చర్యలు తీసుకుంది. ట్రావెల్స్ బస్సుల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులను సీజ్ చేస్తున్నారు. అయితే, అధికారులు ఎన్ని వార్నింగులు ఇచ్చినా, ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దారి దోపిడీ కొనసాగుతూనే ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
