AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 85 వేల మంది మిస్సింగ్.. దొరకని ఆచూకీ.. అసలేం జరిగిందంటే..?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 85 వేల మంది ఆచూకీ లేకుండా పోయారు.. అవును.. మీరు చదువుతున్నది నిజమే. అయితే వీరు మనుషులుగా రికార్డుల్లో ఉన్నారు కానీ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత కీలకమైన కార్డును తీసుకోవడానికి మాత్రం రావడం లేదు. దీంతో అసలు వీరంతా ఎక్కడున్నారు? వీరు నిజమైన లబ్ధిదారులేనా? లేక అక్రమ కార్డులా? అనే సందేహం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Andhra Pradesh: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 85 వేల మంది మిస్సింగ్.. దొరకని ఆచూకీ.. అసలేం జరిగిందంటే..?
Kurnool Ration Card Missing
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jan 11, 2026 | 11:46 AM

Share

ఏపీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నుంచి సాధారణ రేషన్ కార్డుల స్థానంలో ఆధార్ తరహాలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ డీలర్ల ద్వారా వీటి పంపిణీ ప్రక్రియ చేపట్టారు. అయితే నెలలు గడుస్తున్నా వేల సంఖ్యలో కార్డులు యజమానుల కోసం కార్యాలయాల్లోనే ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 6,68,944 మంది కార్డుదారులలో.. 6,19,856 మంది కార్డులు తీసుకోగా ఇంకా 49,098 మంది ముందుకు రాలేదు. నంద్యాల జిల్లాలో మొత్తం 5,32,570 మందిలో.. 4,96,676 మంది కార్డులు పొందగా, ఇంకా 35,894 మంది కార్డులు తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా రెండు జిల్లాల్లో కలిపి సుమారు 85,000 మంది లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టారు.

అసలు వీరంతా ఎక్కడ?

రికార్డుల ప్రకారం వీరందరికీ కార్డులు మంజూరయ్యాయి. కానీ డీలర్ల దగ్గరకు గానీ, సచివాలయాలకు గానీ వీరు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారా, ఇవన్నీ బోగస్ కార్డులా? అందుకే బయటకు రావడానికి భయపడుతున్నారా?, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలియక రావడం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్డులు పంపిణీ కాకపోవడం వల్ల ప్రభుత్వం రేషన్ కోటా ఆదా అవుతోంది. ఒకవేళ వీరు నిజమైన లబ్ధిదారులే అయి ఉండి, సమాచారం లేక కార్డులు తీసుకోకపోతే వారు తమకు అందాల్సిన ఉచిత రేషన్‌ను కోల్పోయి నష్టపోతున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి, ఈ 85 వేల కార్డుల గురించి గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన లబ్ధిదారులు ఎవరో, బోగస్ కార్డులు ఎన్నో తేలిపోతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్
కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కింగ్
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్