AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి తెలుగులో తోపు హీరోయిన్. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2026 | 11:32 AM

Share

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను వెతికి మరీ పట్టుకుంటున్నారు అభిమానులు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ హీరోయిన్ ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఫోటోలో తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఆ క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఆ ముద్దుగుమ్మ ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే..

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. కానీ ఆ తర్వాత అదృష్టం కలిసిరాలేదు. దీంతో ఈ బ్యూటీకి సినీ పరిశ్రమలో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఆమె మరెవరో కాదు అనన్య. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. శర్వానంద్, జై , అంజలి ప్రధాన పాత్రలో నటించిన జర్నీ చిత్రంలో అనన్య హీరోయిన్ నటించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత నితిన్, సమంత కలిసి నటించిన అఆ సినిమాలో హీరో చెల్లిగా కనిపించింది. అలాగే తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అనన్య.. స్వస్థలం ఎర్నాకులం జిల్లా పెరుంబవూరు. పై బ్రదర్స్, వృద్ధనేహే బెహవా వంటి సినిమాల్లో అనన్య బాలనటిగా నటించింది. 2008లో సినీరంగంలోకి అడుగుపెట్టింది అనన్య.. అదే ఏడాది తమిళంలో నాడోడిటిల్ సినిమాతో అరంగేట్రం చేసింది. సీక్రెట్ పోలీస్, షికార్, ఒరు స్మాల్ ఫ్యామిలీ, సీనియర్స్, డాక్టర్ లవ్, కాందహార్, సీనియర్స్, డాక్టర్ లవ్, ఎంకేయ్ ఎపోతుమ్, కుంజలియన్, మాస్టర్స్, నాటోడిమన్నన్, టియాన్ వంటి చిత్రాల్లో నటించింది. తమిళం, తెలుగు, కన్నడ భాషా చిత్రాల్లో నటించింది. అనన్య విలువిద్యలో రాష్ట్ర/జాతీయ ఛాంపియన్‌షిప్‌ను రెండుసార్లు గెలుచుకుంది.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

View this post on Instagram

A post shared by Ananyaa (@ananyahere)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
రోజూ చూయింగ్ గమ్ తింటున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే...
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
వాడిన టీపొడిని పారేస్తున్నారా? ఉపయోగాలు తెలిస్తే అసలు అలా చేయరు!
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
అవి బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతమా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త యాప్.. అన్నీ టికెట్లు ఒకే చోట బుకింగ్
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
ఉదయాన్నే అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఈ 5 రహస్య కారణాలు కావొచ్చు
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
పండక్కి నాటుకోడి తినాలంటే జేబు ఖాళీనే.. వామ్మో ధరలు మరీ ఇంతలా..
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
జుట్టు వేగంగా పెరగాలంటే ఏం చేయాలి?ఈ సింపుల్‌ టిప్స్ ట్రై చేశారంటే
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ ప్లేయర్
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ