నెమలి ఈకను చూస్తే బల్లులు భయంతో వణుకుతాయంట.. ఎందుకో తెలుసా?

Samatha

10 January 2026

నెమలి ఈకలను ఇంటిలో పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందకంటే ఇవి ఇంటికి ప్రత్యేక ఆకర్షణ తీసుకరావడమే కాకుండా, ప్రతికూలతను దూరం చేస్తుంది.

ఇంటికి ఆకర్షణ

అందుకే చాలా మంది నెమలి ఈకలు ఇంటిలో పెట్టుకుంటారు. అయితే దీని వలన ఇంకో ప్రయోజనం కూడా ఉందంటున్నారు నిపుణులు. అది ఏమిటంటే?

నెమలి ఈకలు

ఎవరైతే ఇంటిలో బల్లులతో విసిగిపోతున్నారో, వారు ఇంటిలో నెమలి ఈకను పెట్టుకోవడం వలన బల్లులు పారిపోతాయంట. కాగా, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బల్లుల సమస్య

బల్లులు నెమలి ఈకలను చూస్తే వణికిపోతాయంట. ఎందుకంటే? నెమలి ఈకలు అంటే బల్లులకు చాలా భయం అంటున్నారు నిపుణులు.

బల్లులకు భయం

నెమలి ఈకల మధ్యలో ఒక కన్ను ఆకారం ఉంటుంది. అంతే కాకుండా నెమలి ఈకపై కాంతి పడినప్పుడు అది రిప్లెక్ట్ అవుతుంది.

వెలుగు

అందువలన ఆ కాంతి, ఆ కన్ను ఆకారం చూసినప్పుడు, బల్లులు ఒక పెద్ద జంతువు ఏదో తమ వైపే చూస్తుందనే భావతనో భయపడి పారిపోతాయంట.

కాంతి భయం

బల్లులు సరీసృపాల వర్గానికి చెందినవి కాబట్టి, అవి మచ్చల నుంచి వచ్చే దృశ్య సంకేతాలను ముప్పుగా  భావిస్తాయంట. అలా నెమలి ఈకను చూస్తే కూడా వణికిపోతాయి.

వెలుగంటే భయం

అందవలన ఎవరు అయితే ఇంటిలో బల్లులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారు బల్లులను తరిమి కొట్టడానికి ఇంటిలో నెమలి ఈకలు పెట్టడం చాలా మంచిదంట.

పారిపోతాయి