AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sound Library: సంగారెడ్డి పట్టణంలో సౌండ్ లైబ్రరీ.. దృష్టిలోపం ఉన్నవారికి ఎంతో ఉపయుక్తం

సంగారెడ్డి జిల్లా అధికారులు మరో వినూత్న ప్రయత్నంతో అంధులకు వెన్నుదన్నుగా నిలిచారు. వినడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకునేలా దివ్యాంగుల కోసం ప్రత్యేక లైబ్రరీని ప్రారంభించారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం రాష్ట్రంలోనే మొట్టమొదటి అందుల సౌండ్ లైబ్రరీ కావడం విశేషం. దక్షిణ భారతదేశంలో తొలి శ్రవణ గ్రంథాలయంపై టీవీ9 స్పెషల్ స్టోరీ.

Sound Library: సంగారెడ్డి పట్టణంలో సౌండ్ లైబ్రరీ.. దృష్టిలోపం ఉన్నవారికి ఎంతో ఉపయుక్తం
Sangareddy Sound Library
P Shivteja
| Edited By: |

Updated on: Jan 11, 2026 | 10:44 AM

Share

దృష్టిలోపం ఉన్నవారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చదువు, సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఉద్దేశించిన సౌండ్ లైబ్రరీని సంగారెడ్డి పట్టణంలో జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లైబ్రరీ ద్వారా అంధులు కంప్యూటర్ వినియోగం, పుస్తక పఠనం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను స్వయంగా నిర్వహించగలుగుతారు. ఈ లైబ్రరీ ద్వారా దృష్టి లోపం గల వారికి ఉపయుక్తమైన పలు సదుపాయాలు ఉన్నాయి. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా దృష్టిలోపమున్న వారు పూర్తిస్థాయిలో కంప్యూటర్‌ను స్వయంగా ఆపరేట్ చేయవచ్చు. చదువు, అభ్యాసం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ల వినియోగం వంటి పనులను సులభంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం ఉంది. ఈ సదుపాయం ద్వారా విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ముద్రిత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదవగలుగుతారు. ఇందులో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ (గూగుల్ ఏఐ ఆధారిత) విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఏంజెల్ ప్లేయర్స్ ( డీజీ ప్లేయర్స్) 10 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి..ఈ పరికరాల ద్వారా స్కాన్ చేసిన పుస్తకాలు, ఎడిటబుల్ ఫైళ్లు లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న పుస్తకాలను కాపీ చేసి వినియోగించుకోవచ్చు. కంప్యూటర్ అవసరం లేకుండానే తెలుగు,హిందీ తదితర భారతీయ భాషల పుస్తకాలను ఆడియో రూపంలో వినే సౌకర్యం ఉంది. భారతీయ యాసతో స్పష్టంగా చదివే విధానం ఇందులో ప్రత్యేకత.

ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ఉన్న పుస్తకాలను (పీడీఎఫ్, జేపీజీ లేదా ముద్రిత పేపర్ రూపంలో) బ్రెయిలీ లిపిలోకి మార్పిడి చేసి ముద్రించే సదుపాయం ఉంది. దీంతో దృష్టి హీనత గల వారు బ్రెయిలీ ద్వారా పుస్తకాలను చదవవచ్చు. ఈ లైబ్రరీ దృష్టి లోపం గల విద్యార్థుల విద్యా పురోగతికి, స్వావలంబన దిశగా ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని లైబ్రరీ నిర్వాహకులు తెలిపారు. ఈ సౌండ్ లైబ్రరీని జిల్లాలోని దృష్టిలోపం గల విద్యార్థులు వినియోగించుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.