తెలంగాణలో స్థానిక ఎన్నికల ఫలితాల అనంతరం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పైసలు తీసుకుని ఓటు వేయలేదని ఆరోపణలు రావడంతో, ఓడిపోయిన అభ్యర్థులు ఓటర్ల నుంచి డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఒక అభ్యర్థి భర్త సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపగా, వైరా ఎమ్మెల్యే వదిన విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.