వంటల్లో రుచి కోసం చాలా మంది కొత్తిమీర వేస్తుంటారు. కానీ తినేటప్పుడు మాత్రం ఈ ఆకులు వస్తే తీసి పక్కన పెడతారు. అయితే అలా పక్కన పెట్టడం వల్ల ఎన్నో పోషకాలను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
కొత్తిమీర ఆకులను నేరుగా తినలేని వారు వాటి ఆకులను జ్యూస్‌గా చేసి కూడా తాగవచ్చు. కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్‌లా పట్టాలి
TV9 Telugu
అనంతరం ఆ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా కూడా కొత్తిమీర ఆకులను తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆకుల జ్యూస్‌ను రోజూ సేవిస్తుంటే అనేక లాభాలు కలుగుతాయట
TV9 Telugu
కొత్తిమీర ఆకుల జ్యూస్ తాగితే ఫ్రీ ర్యాడికల్స్ తొలగిపోతాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, క్వర్సెటిన్ వంటి సమ్మేళనాలు శరీరానికి అందుతాయి
TV9 Telugu
కొత్తిమీర వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. రక్త నాళాల వాపులు తగ్గుతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ ఆకుల్లో అధికంగా ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది
TV9 Telugu
శరీర వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది
TV9 Telugu
హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
TV9 Telugu
రక్తనాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఈ రసాన్ని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ ఆకుల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి