Megastar Chiranjeevi-Venkatesh: ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటాను.. వెంకీకి చిరంజీవి బర్త్ డే విషెష్..
విక్టరీ వెంకటేశ్ 65వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం వెంకీకి బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే మన శంకరవరప్రసాద్ గారూ షూటింగ్ లో తీసుకున్న ఫోటోను షేర్ చేశారు.

విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు విక్టరీ వెంకటేశ్. కలియుగ పాండవులు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన వెంకీ.. కెరీర్ మొదటి నుంచి భిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తనదైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వెంకీ.. తెలుగు సినీరంగంలో టాప్ హీరోగా నిలిచాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈరోజు (డిసెంబర్ 13న) వెంకీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీప్రముఖులు, ప్రేక్షకులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం వెంకీకి బర్త్ డే విషెస్ తెలిపారు.
ఈరోజు వెంకటేశ్ 65వ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరు షేర్ చేసిన ప్రత్యేక విషెస్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం చిరు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నారు . ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వెంకీతో తీసుకున్న క్యూట్ ఫోటను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరు.. “నా ప్రియమైన వెంకీ మామకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎక్కడికి వెళ్లినా పాజిటివిటీ ఆప్యాయత తీసుకొస్తారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆదరిస్తాను. మీకు ఆనందంతో, ఆశీర్వాదాలతో నిండిన మరో అద్భుతమైన సంవత్సరం కలగాలని కోరుకుంటున్నాను” అంటూ వెంకీకి బర్త్ డే విషెస్ తెలిపారు.
ఇక చిరు పోస్ట్ పై అభిమానులు స్పందిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇద్దరిని ఒకే ఫ్రేములో చూడడం చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకీ.. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Wishing you many happy returns my dear @VenkyMama 💐💐💐
You’ve always brought warmth and positivity wherever you go, and I cherish every moment we’ve shared during the shoot of #ManaShankaraVaraPrasadGaru 🤗
Have a truly joyful and blessed year ahead. pic.twitter.com/ybPIXQnYZ2
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2025
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..




