Rajinikanth : వెంకన్న సన్నిధిలో సూపర్ స్టార్ రజినీకాంత్.. కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం..
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే రజినీ కసోం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం నిర్వహించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమలకు చేరుకున్న రజినీ..శనివారం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రజినీకాంత్ భార్య లతా, కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, మనవళ్లు లింగ రాజా, యాత్ర రాజాతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రజనీకాంత్ కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను ప్రజలకు ఈఓ వెంకయ్య చౌదరి అందజేశారు.
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
ఇక శ్రీవారికీ తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. భార్య లతాతోపాటు రజనీకాంత్ తులాభారంలో పాల్గొన్నారు. 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, చిల్లర నాణేలతో రజనీకాంత్, 82 కిలలతో లతా రజనీకాంత్ స్వామి వారికి మొక్కులు చెల్లించారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
శుక్రవారం (డిసెంబర్ 12న) రజినీ పుట్టినరోజు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టిన రజినీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్న రజినీ ఈరోజు ఉదయం కుటుంబంతో కలిసి మొక్కలు చెల్లించుకున్నారు. ఇదెలా ఉంటే.. ప్రస్తుతం రజినీ జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..




