మీరు కొన్న తేనె స్వచ్ఛమైనదేనా..? ఇలా తెలుసుకోండి
12 December 2025
TV9 Telugu
TV9 Telugu
తేనె వల్ల ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలోనూ తేనెను పలు ఔషధాలతోపాటు ఇస్తారు. అయితే కొందరు వ్యాపారులు లాభాలకు కక్కుర్తిపడి తేనెను కల్తీ చేస్తున్నారు
TV9 Telugu
మీరు కొన్న తేనె అసలుదో, నకిలీదో ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.. టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. నకిలీ తేనె అయితే వెంటనే నీటిలో కరుగుతుంది. అసలు తేనె గ్లాస్ కరగకుండా అడుగుకి చేరుతుంది
TV9 Telugu
అలాగే ఒక కాటన్ బాల్‌ను తీసుకుని దాన్ని తేనెలో ముంచాలి. అనంతరం దానికి అగ్గిపుల్లతో నిప్పు పెట్టాలి. అసలు తేనె అయితే కాటన్ బాల్ మండుతుంది. నకిలీ తేనె అయితే మండదు
TV9 Telugu
ఒక తేనె చుక్కను గోరుపై వేసుకోవాలి. ఆ చుక్క గోరుపై అటు ఇటు కదిలితే అది నకిలీ తేనె అన్నమాట. అదే ఆ చుక్క కదలకుండా స్థిరంగా ఉంటే ఆ తేనెను అసలైందిగా భావించాలి
TV9 Telugu
సాధారణంగా మొలాసిస్, మొక్కజొన్న పిండి తదితర పదార్థాలను ఉపయోగించి నకిలీ తేనెను తయారు చేస్తారు. ఈ క్రమంలో నకిలీ తేనెను గుర్తించడం చాలా సులభమే
TV9 Telugu
కొద్దిగా తేనె తీసుకుని దానికి 2, 3 చుక్కల వెనిగర్ కలపాలి. అనంతరం వాటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా వచ్చిన మిశ్రమం ఎక్కువగా నురగను విడుదల చేస్తుంటే అది ఖచ్చితంగా నకిలీ తేనెగా గుర్తించాలి
TV9 Telugu
ఎందుకంటే నకిలీ తేనె చక్కెర కూడా ఉంటుంది. ఇది వెనిగర్‌తో కలిస్తే నురగలాంటి ద్రవాన్ని ఇస్తుంది. అసలైన తేనె ఇలా నురగను ఇవ్వదు
TV9 Telugu
ఇక సాధారణంగా స్వచ్ఛమైన తేనె అయితే అసలు ఎక్స్‌పైరీ ఉండదు. రోజులు గడిచే కొద్దీ ఇంకా రుచి పెరుగుతుంది. కానీ మార్కెట్‌లో కొన్నికల్తీ తేనెకు ఎక్స్‌పైరీ డేట్ కూడా ఉంటుంది