పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు పేరుతో కారుకు నకిలీ స్టిక్కర్లు అంటించి టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మునవర్ గతంలో మాజీ ఎమ్మెల్యే రాంబాబు వద్ద కార్ డ్రైవర్గా పనిచేశాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పల్నాడులో చర్చనీయాంశంగా మారింది.