ఉదయాన్ని ఈ నీళ్లు తాగండి.. షుగర్‌నే కాదు, బరువుకు హైఫీవర్ రావాల్సిందే
venkata chari
జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు వంటి సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. చలికి బద్ధకం పెరిగి వ్యాయామం తగ్గడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
చలికాలం వచ్చిందంటే చాలు
మన వంటింట్లో లభించే దాల్చిన చెక్క (Cinnamon) తో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. రోజూ ఉదయాన్నే దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు చూద్దాం..
వంటింట్లో
దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరిగి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల దరిచేరవు.
రోగ నిరోధక శక్తి
దాల్చిన చెక్క నీరు మెటబాలిజం (జీవక్రియ) రేటును పెంచుతుంది. ఇది శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించి, బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గడంలో
డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి దాల్చిన చెక్క నీరు అమృతంతో సమానం. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో
చలికాలంలో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తాయి. దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
ఒక గ్లాసు నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించాలి. నీరు గోరువెచ్చగా అయ్యాక వడకట్టుకుని తాగాలి.
తయారీ విధానం
ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గర్భిణీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని పాటించాలి.