Weight loss Tea: ఈ స్పెషల్ టీ తాగితే చాలు.. పొట్ట చుట్టూ కొండలా ఉన్న కొవ్వు.. క్యాండిల్‌లా కరిగిపోతుంది..!
టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల టీలు కడుపు ఉబ్బరం, అజీర్ణం నుండి బరువు తగ్గడం వరకు చాలా సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తాయి.. టీ లేదా డికాక్షన్ కాకుండా ఈ ప్రత్యేక పదార్థాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పలువురు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి స్పెషల్ టీల గురించి ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గించే చిట్కాలు: ఈ ప్రత్యేక పదార్థాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల సాధారణ టీ కషాయం కంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈరోజు మనం ఆ స్పెషల్ టీ ఏమిటి..? దానిని ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం.
పుదీనా టీ: పుదీనా ఆకులు అజీర్ణానికి గొప్ప ఔషధం. ఈ ఆకుల నుండి పలురకాల మందులు కూడా తయారు చేస్తారు. అయితే, ఈ ఆకుల నుండి తయారుచేసిన టీ తాగటం వల్ల అజీర్ణం, దుర్వాసన, మానసిక అలసటను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ టీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పుదీనీ టీ తయారీ కోసం తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి, మరిగించి, కొంతసేపు మూత పెట్టి పక్కనపెట్టాలి. కావాలనుకుంటే, మీరు పుదీనా ఆకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇలా తరచూ పుదీనా టీ తయారు చేసుకుని తాగటం వల్ల కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో ఊహించని మార్పును గమనిస్తారు.
లవంగం టీ: జీర్ణక్రియను మెరుగుపరచడానికి లవంగం మంచి ఎంపిక. లవంగాలలోని పదార్థం జీర్ణ ఎంజైమ్‌ల విడుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యూజినాల్ జీర్ణవ్యవస్థలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. వేడి నీటిలో కొన్ని లవంగాలను మరిగించటం ద్వారా లవంగం టీ తయారు చేస్తారు.. రుచి కోసం మీరు ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు.
జీలకర్ర టీ: జీలకర్ర జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. జీలకర్ర అపానవాయువు, గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కలిగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఆందోళనను తగ్గించడంలో, మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జీలకర్రను నీటితో మరిగించి వడకట్టి తీసుకుంటే.. కడుపు సంబంధిత సమస్యలకు మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








