Watch: పైసా పైసా జమచేసింది.. ఆఖరుకు గళ్లా పగులగొట్టి చూస్తే గుండెలు గుభేల్..!
అదృష్టం ఎప్పుడు ఎవరినీ వరిస్తుందో చెప్పలేం.. అలాగే దురదృష్టం మాత్రం కొందరినీ ఎక్కడికీ వెళ్లినా వదలకుండా వెంటాడుతూనే ఉంటుంది. కష్టపడి పనిచేసినా, అంకితభావం ఉన్నప్పటికీ అదృష్టం అనుకూలంగా లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పాపం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము తనది కాకుండా పోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఆమె పట్ల జాలిపడతారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

సోషల్ మీడియాలో హృదయ విధారక సంఘటన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీడియోలో ఒక మహిళ ఏడాది పొడవునా తాను కష్టపడి సంపాదించిన దాంట్లోంచి కొద్ధి కొద్దిగా పిగ్గీ బ్యాంకులో దాచుకుంటూ వస్తోంది. చివరకు ఒక రోజు ఆమె తన పిగ్గీ బ్యాంకును పగలగొట్టి చూసినప్పుడు కనిపించిన దృశ్యం హృదయ విదారకంగా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆ మహిళ డబ్బు జమ చేసుకున్న మట్టి పిగ్గీ బ్యాంకును పగలగొట్టి చూస్తే, పెద్ద మొత్తంలో కాగితపు కరెన్సీ నోట్లు కనిపించాయి. కానీ, ఆమె ముఖంలో ఆనందానికి బదులుగా, ఆందోళన, నిరాశ ఎదురైంది.. ఆమె కళ్ల నిండా నీళ్లు నిండిపోయాయి. ఎందుకంటే తాను రోజుల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముంతా చెదపురుగుల వల్ల పూర్తిగా పాడైపోయాయి.. కొన్ని గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియోను సోషల్ మీడియాలో లక్షలాది మంది వీక్షించారు. చాలా మంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు దీనిని విచారకరమైనది. కానీ, ఇలాంటి పనులు చేస్తున్నవారికి ఒక గుణపాఠం అని చెబుతున్నారు. మరికొందరు ఇలా రాశారు.. కష్టపడి సంపాదించిన డబ్బు వృధా కావడం అంటే హృదయ విదారకంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




