AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురిని భయపెట్టేందుకు బావిలోకి వేలాడదీసిన తండ్రి.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..

ఓ తండ్రి తన 11ఏళ్ల కూతుర్ని భయపెట్టేందుకు బావిలోకి వేలాడదీశాడు.. కానీ, పాపం అదే నిజమైంది. అతని చేతుల్లోంచి పట్టుతప్పి చిన్నారి బావిలో పడిచనిపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 21వ తేదీ రాత్రి జరిగిందని మిస్రిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కూతురిని భయపెట్టేందుకు బావిలోకి వేలాడదీసిన తండ్రి.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
Father Hanged Daughter In To Well
Jyothi Gadda
|

Updated on: Oct 24, 2025 | 3:18 PM

Share

పిల్లలు చెప్పిన మాట వినలేదంటే..ఏదో ఒక పనిష్మెంట్‌ ఇస్తుంటారు తల్లిదండ్రులు. వారిని భయపెట్టేందుకు చీకటి గదిలో బంధిస్తుంటారు. క్యాండిల్‌తో కాల్చి భయపెడుతుంటారు. అలాగే, మరికొందరు బూచోడికి పట్టిస్తామని బెదిరిస్తారు. అయితే, ఓ తండ్రి తన 11ఏళ్ల కూతుర్ని భయపెట్టేందుకు బావిలోకి వేలాడదీశాడు.. కానీ, పాపం అదే నిజమైంది. అతని చేతుల్లోంచి పట్టుతప్పి చిన్నారి బావిలో పడిచనిపోయింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా నుండి హృదయ విదారక వార్త వెలుగులోకి వచ్చింది. మిస్రిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఒక తాగుబోతు తండ్రి తన 11 ఏళ్ల కుమార్తెను బావిలో వేలాడదీసి భయపెట్టడానికి ప్రయత్నించాడు. అయితే, అతను పట్టు కోల్పోవటంతో ఆ అమ్మాయి బావిలో పడి చనిపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 21వ తేదీ రాత్రి జరిగిందని మిస్రిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరవింద్ సింగ్ మాట్లాడుతూ, నిందితుడు శ్రవణ్ కుమార్ మద్యానికి బానిసగా మారాడని చెప్పాడు. అతను తాగి ఇంటికి వచ్చి తన కూతురు లక్ష్మిని భోజనం పెట్టమని అడిగాడు. అప్పటికీ వంట పూర్తి కాలేదని ఆమె చెప్పింది. దాంతో అతను కోపంతో ఊగిపోతూ..ఆమెను తాడుతో కట్టి బావిలోకి వెలాడదీశాడు. కానీ, దురదృష్టవశాత్తు అతని చేయి జారి కూతురు బావిలో పడిపోయింది. ఇది చూసిన తండ్రి ఆమెను కాపాడటానికి లోపలికి దూకాడు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఇరుగుపొరుగు గుమిగూడారు. తండ్రీ కూతుర్ని అతి కష్టం మీద బయటకు లాగారు. కానీ, అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది.

ఇవి కూడా చదవండి

పోలీసులు హత్య కేసు నమోదు చేసి శ్రవణ్‌ను అరెస్టు చేశారు. శ్రవణ్ భార్య ఆరు సంవత్సరాల క్రితం మరణించింది. ఆ తర్వాత, అతను మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తరచూ ఇంట్లో గొడవలు చేస్తుండేవాడని పోలీసు విచారణలో తేలింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా