Watch: కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..తిరిగి ఆరునెలల తరువాతే..! కారణం ఏంటంటే..
ఈ సంవత్సరం, కేదార్‌నాథ్ యాత్రలో, 17.39 లక్షల మంది భక్తులు కేదార్‌ను సందర్శించారు. ప్రారంభం నుండి కేదార్‌నాథ్ దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో బారులు తీరారు. బుధవారం కూడా, ఐదు వేలకు పైగా భక్తులు కేదార్‌నాథ్ దర్శనం కోసం చేరుకున్నారు. కేదార్‌నాథ్‌లో చలి మొదలైంది. బుధవారం మధ్యాహ్నం ఇక్కడ పొగమంచు కమ్ముకుంది.

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర కేదార్‌నాథ్ ఆలయం మూతపడింది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల ఒడిలో మందాకిని నది ఒడ్డున ఉంది. ఈ రోజు (అక్టోబర్ 23) భాయ్ దూజ్ సందర్భంగా చార్ ధామ్ యాత్రలలో ఒకటైన కేదార్‌నాథ్ ద్వారాలు మూసివేయబడ్డాయి.’భాయ్ దూజ్’ పండుగ సందర్భంగా ఇవాళ వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ ద్వారాలను మూసివేశారు. దీంతో ఆరు నెలల తర్వాత ఆలయం తిరిగి తెరుచుకోనుంది.
ఈ విరామ సమయంలో ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్‌లో కేదారేశ్వరుడికి పూజలు చేయనున్నారు. ఈ మేరకు స్వామి పల్లకి తరలివెళ్లింది. అలాగే చార్‌ధామ్‌లోని గంగోత్రి నిన్న(అక్టోబర్22న) యమునోత్రి 23న, బద్రీనాథ్ నవంబర్ 25న మూతపడనున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది, ఉపాధ్యక్షుడు రిషి ప్రసాద్ సతీ, విజయ్ కప్రవన్, కేదార్ సభ అధ్యక్షుడు పండిత్ రాజ్‌కుమార్ తివారీ, కేదార్ సభా మంత్రి పండిత్ అంకిత్ ప్రసాద్ సెమ్‌వాల్, ధర్మాధికారి ఓంకార్ శుక్లా, పూజారి బాగేశ్ లింగ్, ఆచార్య సంజయ్ తివారీ, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం, కేదార్‌నాథ్ యాత్రలో, 17.39 లక్షల మంది భక్తులు కేదార్‌ను సందర్శించారు. ప్రారంభం నుండి కేదార్‌నాథ్ దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో బారులు తీరారు. బుధవారం కూడా, ఐదు వేలకు పైగా భక్తులు కేదార్‌నాథ్ దర్శనం కోసం చేరుకున్నారు. కేదార్‌నాథ్‌లో చలి మొదలైంది. బుధవారం మధ్యాహ్నం ఇక్కడ పొగమంచు కమ్ముకుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








