AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం తరువాత ఇలా చేస్తే.. బొడ్డు చుట్టూ కొవ్వు కరిగి సొగసైన నడుము మీ సొంతం..!

మీరు భోజనానికి హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళితే తిన్న తర్వాత టేబుల్‌పై సోంపు పెడతారు.. మీరు తిన్న ఆహారం సులభంగా జీర్ణం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అతిగా తినటం వల్ల కలిగే కడుపు అసౌకర్యానికి ఒక్క టీ స్పూన్‌ సోంపు తినటం వల్ల ఈజీగా సమస్య పరిష్కారం అవుతుంది. దీంతో మీ కడుపులో తేలికగా ఉండటమే కాకుండా, మీ శ్వాస కూడా తాజాగా ఉంటుంది. అంతేకాదు, మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

భోజనం తరువాత ఇలా చేస్తే..  బొడ్డు చుట్టూ కొవ్వు కరిగి సొగసైన నడుము మీ సొంతం..!
Fennel Seeds
Jyothi Gadda
|

Updated on: Oct 19, 2025 | 4:53 PM

Share

సోంపు గింజల్లో కార్బోహైడ్రేట్స్‌, డైటరీ ఫైబర్‌, ప్రోటీన్‌, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి కంటెంట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సోంపు గింజల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. సోంపు గింజలు తింటే మలబద్దకం తగ్గుతుంది. అన్నం తిన్న తర్వాత సోంపు గింజలు తినడం వల్ల బీపీ కంట్రోల్‌ అవుతుంది. సోంపు గింజల్లో పొటాషియం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొద్దిగా సోంపును క్రమం తప్పకుండా నమలడం వల్ల మధుమేహం కూడా నియంత్రించబడుతుంది.

సోంపు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. అన్నం తిన్న తర్వాత సోంపు తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అన్నం తిన్న తర్వాత సోంపు తింటే సోంపు జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది, ఇది కేలరీలను త్వరగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు. తరచుగా తినే అలవాటును అరికట్టవచ్చు. అలాగే, ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది.

సోంపు గింజల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా మార్చుతాయి. సోంపు గింజల్లో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. సోంపు గింజలు తింటే కొల్లాజెన్‌ సంశ్లేషణ పెరుగుతుంది. ముడతలు తగ్గుతాయి. సోంపులో ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పులను కంట్రోల్‌ వస్తాయి. సోంపు గింజలు తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. సోంపు గింజలు తింటే జ్వరం వేగంగా తగ్గుతుంది. సోంపు తినడం వల్ల కళ్ళకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

సోంపులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, అనేక ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. సోంపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సోంపు గింజలు తింటే వయస్సుతో పాటు వచ్చే సమస్యలు తగ్గుతాయి. సోంపు తినడం వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..