AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఖాళీ కడుపుతో ఈ మూడింటిని ఎప్పుడూ తినొద్దు.. లేదంటే ఆ సమస్యకు షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే..!

కడుపు మన గుండెకు అనుసంధానించబడి ఉంటుందని మీరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ మన ఆరోగ్యం కూడా కడుపుతో ముడిపడి ఉంటుందని మీకు తెలుసా?. మన కడుపు ఆరోగ్యంగా ఉంటేనే మనకు అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. ఒక వేళ కడుపు ఆరోగ్యం దెబ్బతింటే.. అనారోగ్యాలు మన శరీరంపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి, ఏదైనా తినే ముందు మన పేగు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి

Health Tips: ఖాళీ కడుపుతో ఈ మూడింటిని ఎప్పుడూ తినొద్దు.. లేదంటే ఆ సమస్యకు షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే..!
Health Tips
Anand T
|

Updated on: Oct 19, 2025 | 4:44 PM

Share

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను ఫాలో అవుతూ చాలా మంది ఖాళీ కడుపుతో ఏవేవో తీసుకుంటున్నారు. తద్వారా అనారోగ్య మస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మనం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కూడా రోజంతా బలహీనంగా, నీరసంగా అనిపిస్తే ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో ఉన్న సమస్యలను తెలియజేస్తుంది. ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు తినడం వల్ల మన కడుపు ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఇది సూచిస్తుంది. కాబట్టి వైద్య నిపుణుల ప్రకారం ఖాళీ కడుపుతో ఎప్పుడూ తినకూడని కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం

ఖాళీ కడపుతో ఎప్పుడూ వీటిని తినకండి

సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయలు, దానిమ్మ లేదా ఆమ్లా వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సితో పాటు అనే గొప్ప వనరులు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తి పెంచుతాయి. అలాగే చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రిక్ ఆమ్లం నేరుగా కడుపు పొరను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కడుపు ఆరోగ్యం దెబ్బతింటుంది

వీటిని తినడం వల్ల కడుపులో చికాకు, నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో అదనపు యాసిడ్ తీసుకోవడం వల్ల కడుపులోని pH బ్యాలెన్స్ అసమతుల్యతకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో, ఇది దంతాల మెరిసే పొరను (ఎనామెల్) కూడా బలహీనపరుస్తుంది, కాబట్టి ఖాళీ కడుపుతో వీటిని ఎప్పుడూ తీసుకోవద్దు.

బ్లాక్ కాఫీ: చాలా మంది ఉదయం లేచిన వెంటనే బ్లాక్ కాఫీ, టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థకు యాసిడ్ లాగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే బ్లాక్ కాఫీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, శక్తి లేకపోవడం వంటివి సంభవిస్తాయి.

ఎక్కువ నూనె ఆహారాలు: ఎక్కువ అయిల్‌ ఫుడ్స్‌ తినడం కూడా ఆరోగ్యానికి హానికరం. చోలే భటురే, పావ్ భాజీ, కచోరి వంటి బాగా వేయించిన ఆహారాలు ఖాళీ కడుపుతో తింటే రుచికరంగా అనిపించవచ్చు, కానీ అవి బరువుగా ఉండి కడుపులో భారమైన అనుభూతిని కలిగిస్తాయి. అవి కడుపుపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి, కాబట్టి వైద్యులు తరచుగా ఖాళీ కడుపుతో వాటిని తినకూడదని సలహా ఇస్తారు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తెలియజేయడం జరిగింది. మీరు వీటిని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించండం మంచింది.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.