Health Tips: శీతాకాలంలో వీటిని తీసుకుంటే.. వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి!
శీతా కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్ లో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చలి కాలంలో రోజు వారి ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకోవడం వల్ల.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు కూడా ఒకటి. వీటిలో ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. నల్ల మిరియాల్లో యాంటీ..

శీతా కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్ లో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా చలి కాలంలో రోజు వారి ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకోవడం వల్ల.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు కూడా ఒకటి. వీటిలో ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటీరీ గుణాలతో పాటు విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. శీతాకాలంలో మిరియాలను తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సీజనల్ వ్యాధులు దరి చేరవు:
వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, ఉబ్బసం, జ్వరం వంటివి ఎటాక్ చేస్తూనే ఉంటాయి. ఇలాంటి రాకుండా ఉండాలంటే.. నల్ల మిరియాలు హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా చూస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది:
శీతా కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీలో కూడా ఉష్ణోగ్రత పడి పోతుంది. ఈ సమయంలోనే ఇమ్యూనిటీ లెవల్స్ కూడా తగ్గి పోయి.. నీరసంగా, అలసటగా ఉంటుంది. దీంతో పలు రకాల సమస్యలు ఎటాక్ అవుతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పడి పోకుండా చూస్తుంది.
శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది:
నల్ల మిరియాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటీరీ గుణాల కారణంగా శ్వాస కోశ రాకుండా ఉంటాయి. చలి కారణంగా దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మిరియాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే.. శ్వాస కోశ సమస్యలు, ఉబ్బసం కూడా తగ్గుతుంది.
జీర్ణ సమస్యలను తలెత్తవు:
నల్ల మిరియాల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడి.. సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో గ్యాస్, కడుపులో నొప్పి, మల బద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా సయాటికా సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటితో వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.