పాలకూర, బచ్చలికూర, తోటకూర, గోంగూర, మెంతికూర... ఇలా ఈ కాలంలో వచ్చే తాజా ఆకుకూరలు అన్నింటినీ తప్పక తినండి
TV9 Telugu
దీనివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. చర్మానికి తేమ అందుతుంది. ఈ ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి, కె విటమిన్లతో పాటు ఫోలేట్, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తాయి. శక్తినిస్తాయి. పేగు ఆరోగ్యాన్నీ కాపాడతాయి. ముఖ్యంగా పాలకూరతో లభించే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు
TV9 Telugu
శరీరంలో వాపును తగ్గిస్తాయి. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి గలవారు పాలకూరను మితంగా తీసుకోవాలి
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయం రాదు. గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది
TV9 Telugu
దీంతో లభించే ఇనుము, మెగ్నీషియం, విటమిన్ కె, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బీ2, బీ6 మన కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి. పాలకూరలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నందున చర్మం కాంతిమంతంగా ఉంటుంది
TV9 Telugu
పాలకూర తరచూ తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది