PM Modi: ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా.. ప్రధాని మోదీని వరించిన మరో అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రధాని మోదీకి అందజేశారు. భారత్-ఇథియోపియా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక ప్రాత పోశించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ప్రపంచంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ నిలిచారు.

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ ఆయన్ను వరించింది. మంగళవారం అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ ప్రధాని మోదీకి ఈ పురస్కారిన్ని అందజేశారు. భారతదేశం-ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన అసాధారణ కృషికి, ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా ఆయన దార్శనిక నాయకత్వానికి గాను మోదీకి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.
అయితే ఈ అవార్డును అందుకున్న మొదటి ప్రపంచ దేశాధినేత, ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి మోదీ కావడం విశేశం. ఇథియోపియాకు చెందిన ‘గ్రేట్ హానర్ నిషాన్’ అవార్డును ప్రదానం చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. దీనిని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నాను” అని మోడీ Xలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటైన ఈ అవార్డును స్వీకరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తాను దానిని లోతైన వినయం ,కృతజ్ఞతతో స్వీకరించానని ఆ ప్రకటన పేర్కొన్నారు. ఈ గౌరవానికి గాను ప్రధాని అబియ్, ఇథియోపియా ప్రజలకు ప్రధానమంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన మంత్రి అబియ్ నాయకత్వాన్ని, జాతీయ ఐక్యత, స్థిరత్వం, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఆయన చేస్తున్న చొరవను ఆయన ప్రశంసించారు. జాతి నిర్మాణంలో జ్ఞానం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఇథియోపియా పురోగతి, అభివృద్ధికి తోడ్పడటం ఒక శతాబ్దానికి పైగా భారతీయ ఉపాధ్యాయులకు లభించిన గౌరవమని మోదీ అన్నారు. యుగయుగాలుగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకున్న భారతీయులు, ఇథియోపియన్లందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు మోదీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
