చలిగా ఉందని రాత్రుళ్లు సాక్స్ ధరించి పడుకుంటున్నారా.? డేంజర్ అంటున్న నిపుణులు..
దీంతో వేడిగా ఉండడానికి జర్కిన్ మొదలు, చేతులకు గ్లౌవ్స్ వరకు ధరిస్తున్నారు. ఇలా శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదలకు రక్షణగా సాక్సులు సైతం ధరిస్తుంటారు. రాత్రుళ్లు పడుకునే సమయంలో కూడా కొందరు సాక్సులు ధరించి పడుకుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు...

రోజురోజకీ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వేడిగా ఉండడానికి జర్కిన్ మొదలు, చేతులకు గ్లౌవ్స్ వరకు ధరిస్తున్నారు. ఇలా శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదలకు రక్షణగా సాక్సులు సైతం ధరిస్తుంటారు. రాత్రుళ్లు పడుకునే సమయంలో కూడా కొందరు సాక్సులు ధరించి పడుకుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే సమయంలో సాక్స్ ధరిస్తే ఆరోగ్యానికి ప్రమాదమని చెబుతున్నారు. ఇంతకీ రాత్రి సాక్సు ధరించి పడుకుంటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* రాత్రుళ్లు సాక్సు ధరించి పడుకుంటే రక్త ప్రసరణ దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లు కదపని కారణంగా రాత్రుళ్లు సాక్సులు ధరిస్తే.. నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
* పాదాలకు సాక్సులు ధరించడం వల్ల శరీరం వేడగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్ని సందర్బాల్లో ఈ వేడీ శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం వేడెక్కడంతో పాటు అసౌకర్యానికి గురవుతుంది.
* ఇక రాత్రంతా సాక్సు ధరించి పడుకోవడ వల్ల కొన్ని సందర్భాల్లో పాదాలలో ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ముఖ్యంగా చెమటలు పట్టడం వల్ల కాలి వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
* బిగుతుగా ఉండే సాక్సులు ధరించడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. దీంతో ఇది నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
* ఇక సాక్సులు ధరించి పడుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బిగుతుగా ఉండే సాక్సులు ధరించడం వల్ల సిరల్లో ఒత్తిడి పెరిగి గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..