Kids Health: పిల్లల్లో ఊబకాయానికి ప్రధాన కారణం ఇదే.. నిపుణులు ఏమంటున్నారంటే.
మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారుల్లో పొత్తి కడుపులో అధిక కొవ్వు, అధిక బీపీ, తక్కువ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్, అధిక చక్కెర వంటి సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యతో బాధపడే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారుల్లో...

ఊబకాయం ఒకప్పుడు కేవలం పెద్దలకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు చిన్నారుల్లోనూ కనిపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడంతో చిన్నారుల్లోనూ ఊబకాయం సమస్య వెంటాడుతోంది. ఇదంతా ఇలా ఉంటే చిన్నారుల్లో ఊబకాయానిని మెటబాలిక్ సిండ్రోమ్ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి.? దీని నుంచి చిన్నారులను ఎలా బయటపడెయ్యాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారుల్లో పొత్తి కడుపులో అధిక కొవ్వు, అధిక బీపీ, తక్కువ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్, అధిక చక్కెర వంటి సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యతో బాధపడే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారుల్లో అధిక బరువు పెరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇన్సులిన్ గ్లూకోజ్ శరీర కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. శరీరం ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించలేనప్పుడు, ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది.
ఇక మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడే చిన్నారుల్లో కనిపంచే ప్రధాన లక్షణాల్లో ఊబకాయం, పొత్తి కడుపు కొవ్వు, అకాంథోసిస్ నైగ్రికన్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే చర్మం మడతలుగా మారి, చర్మం ముదురు రంగులోకి మారుతుంది. ఊబకాయం కారణంగా పిల్లల్లో ఫ్యాటీ లివర్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో పాటు ఆడపిల్లల్లో పీసీఓస్ వంటి సమస్యలు వస్తాయి.
జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్‌కు చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవడం ద్వారా బీపీ, బ్లడ్ షుగర్, లిపిడ్‌లు అదుపులో ఉంటాయి. ఎదిగే పిల్లల్లో స్థూలకాయాన్ని అదుపులో ఉంచాలని, ఇందుకోసం డాక్టర్ల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్నారులకు ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్‌ను అలవాటు చేయకూడదని చెబుతున్నారు. ఆహారంలో వీలైనంత ఎక్కువ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు భాగం చేయాలని చెబుతున్నారు. అలాగే చిన్నారుల స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, ఆటలపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




