ఓ వైపు చలి, మరో వైపు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. సింపుల్ టిప్స్ మీకోసం!

Samatha

29 December 2025

శీతాకాలం వచ్చిందంటే చాలు, ఓ వైపు చలి, మరో వైపు అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా దగ్గు , జలుబు సమస్యలు ఎక్కువ వేధిస్తాయి.

అయితే శీతాకాలంలో జలుబు , దగ్గు సమస్యల నుంచి త్వరగా బయటపడాలి అంటే తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

చలికాలంలో దగ్గు, జలుబు సమస్య వేధిస్తుంటే, అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం చాలా మంచిదంట. దీని వలన త్వరగా జలుబు, దగ్గు సమస్య తగ్గుతుంది.

అలాగే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగడం చాలా మంచిది. దీని వలన శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

అదే విధంగా తులసి ఆకులను మరిగించి ఆ నీటిని తాగడం వలన కూడా రోగనిరోధక శక్తి పెరిగి, జలుబు , దగ్గు త్వరగా తగ్గుతుంది.

అలాగే, మిరియాల రసం కూడా జలుబు, దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది. చలికాలంలో మిరియాల రసం ఆరోగ్యానికి చాలా మంచిది.

తేనె, దాల్చిన చెక్కెను కలిపి తీసుకోవడం వలన కూడా జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అదే విధంగా ప్రతి రోజూ అల్లం టీ తాగడం, ఆవిరి పట్టడం వంటిది చేయడం వలన కూడా జలుబు తగ్గిపోయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది.