AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలోని భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక పాస్‌పోర్ట్, వీసాలకు పరుగులు అక్కర్లేదు.. ఎందుకంటే?

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉండేవారికి ఇదో శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం అమెరికాలోని భారతీయ డయాస్పోరాకు కాన్సులర్ సేవలను మరింత సులభతరం చేయడానికి కొత్త చొరవలు తీసుకుంటోంది. డిసెంబర్ 15, 2025 నుండి లాస్ ఏంజిల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ప్రారంభమైంది. ఇది VFS గ్లోబల్ నిర్వహిస్తోంది.

అమెరికాలోని భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక పాస్‌పోర్ట్, వీసాలకు పరుగులు అక్కర్లేదు.. ఎందుకంటే?
Indian Consulate La
Anand T
|

Updated on: Dec 17, 2025 | 9:50 AM

Share

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉండేవారికి నిజంగా ఇదో శుభవార్తే.. అవును పాస్‌పోర్ట్‌లు, వీసాలు, OCI దరఖాస్తులతో సహా వివిధ కాన్సులర్ సేవల కోసం ఇకపై మీరు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిసెంబర్ 15, 2025 నుండి లాస్ ఏంజిల్స్‌లోనే కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC) ప్రారంభమైంది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ కొత్త కేంద్రాన్ని VFS గ్లోబల్ నిర్వహిస్తుంది. దీంతో దక్షిణ కాలిఫోర్నియా, ఆస్పా ప్రాంతాలలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది.

డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని 800 S ఫిగ్యురోవా స్ట్రీట్, సూట్ 1210, లాస్ ఏంజిల్స్, CA 90017 వద్ద ఈ కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేయబడింది. ఈ కేంద్రం సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు పనిచేస్తుంది. ఇక్కడ మరో ప్రత్యేక విషయం ఏమిటంటే, దరఖాస్తుదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, శనివారాల్లో కూడా ఇక్కడ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇది శ్రామిక ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించే నిర్ణయం

ఇక్కడ ఏ ఏ సేవలు అందుబాటులో ఉంటాయి

లాస్‌ ఏంజెల్స్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రవాస భారతీయులకు దాదాపు అన్ని ముఖ్యమైన కాన్సులర్ సేవలను అందిస్తుంది, కాబట్టి రకారకాల సేవల కోసం మీరు అనేక కార్యాలయాలను చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఈ ఒక్క సెంటర్‌ వస్తే చాలా అన్ని పనులు ఇక్కడే చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

ఈ కొత్త సెంటర్ ద్వారా ఈ క్రింది సేవలు అందుబాటులో ఉంటాయి
  • పాస్‌పోర్ట్ అప్లికేషన్లు, రెన్యూవల్
  • వీసా సేవలు
  • OCI (ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డ్ అప్లికేషన్లు, రీ-ఇష్యూ, మిస్సెలేనియస్ సేవలు
  • ఇండియన్ సిటిజన్‌షిప్ రెనన్సియేషన్ (సరెండర్ సర్టిఫికేట్)
  • గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ (GEP)
  • అటెస్టేషన్, ఇతర మిస్సెలేనియస్ కాన్సులర్ సేవలు

ప్రవాస భారతీయులకు ఊపశమనాన్ని కలిగించే నిర్ణయం

ఈ చొరవతో అమెరికాలోని భారతీయులు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లకుండా, స్థానికంగానే ఈ సేవలను సులభంగా పొందవచ్చు. ఇది సమయం, డబ్బు ఆదా చేసి, ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేస్తుందని CGI పేర్కొంది. ఈ కేంద్రం లాస్ ఏంజిల్స్, చుట్టుపక్కల రాష్ట్రాలలో నివసిస్తున్న భారతీయులకు వన్-స్టాప్ పరిష్కారంగా మారనుంది. మొత్తంమీద, ఈ చర్య USలో నివసిస్తున్న భారతీయులకు ఒక ప్రధాన సౌలభ్యంగా ప్రభుత్వం తీసుకున్న సానుకూల చొరవగా పరిగణించబడుతుంది. దీని గురించి మరిన్ని వివరాల కోసం VFS గ్లోబల్ వెబ్‌సైట్ (visa.vfsglobal.com/usa/en/ind) లేదా లాస్ ఏంజిల్స్ ఇండియా కాన్సులేట్ అధికారిక సైట్‌ను సందర్శించండి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.